ఇండియా: బీజేపీలో ఫుల్ కాన్ఫిడెన్స్, కాంగ్రెస్‌లో కలవరపాటు.. ఈ కీలక విషయం గమనించారా..?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ ఈ రెండు పార్టీలలో ఏదో ఒకటి గెలుస్తుందని సర్వేలు తమ అంచనాలను బయటపెట్టాయి. అన్ని సర్వేలు ఒక్క వైసీపీ మాత్రమే గెలుస్తుందని చెప్పలేదు టీడీపీ కూడా గెలుస్తుందని ఆశలు రేకెత్తించాయి. వారిలో కాన్ఫిడెన్స్ నింపాయి. ఇక జాతీయస్థాయి సర్వేల విషయానికి వస్తే, ఆ సర్వేల ఫలితాలు కాంగ్రెస్ కి షాక్ ఇచ్చేలాగా, నిరాశపరిచేలాగా ఉన్నాయి. ఒక్క సర్వే కూడా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని తెలపలేదు. బీజేపీకి భారీగా సీటు తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్పడమే కానీ సర్వేలు మాత్రం కాంగ్రెస్ ఈసారి బాగా పుంజుకుని అధికారంలోకి వస్తుందని చెప్పలేదు.
ఈ సర్వే ఫలితాలను చూసి బీజేపీ కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకుంది కాంగ్రెస్ ఏమో కలవర పడుతోంది. ఇటీవల ABP న్యూస్, సీవోటర్ సర్వే 373 పార్లమెంటు స్థానాలు ఎన్‌డీఏకి వస్తాయని తెలిపింది. ఇందులో 323 బీజేపీ గెలుచుకుంటుందని ఆ సర్వే తెలపడం విశేషం. కాంగ్రెస్‌కు 65, I.N.D.I.Aకి 155 పార్లమెంటు స్థానాలు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. ఏప్రిల్ నాటి ఇండియా టీవీ CNX సర్వే ప్రకారం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 543 లోక్‌సభ స్థానాల్లో 393 గెలుచుకోవచ్చు, ఇందులో బీజేపీ ఒక్కటే 343 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 40, I.N.D.I.Aకి 99 స్థానాలు వస్తాయని పేర్కొంది.
టైమ్స్‌ నౌ ETG మార్చి నాటి సర్వే ప్రకారం ఎన్‌డీఏ 358–398 స్థానాలను గెలుచుకుంటే, I.N.D.I.Aకి 110–130 స్థానాలు వస్తాయని, 40–50 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని అంచనా. ఇండియా టుడే నిర్వహించిన సర్వేల్లో కూడా భారీ మెజారిటీతో ఎన్‌డీఏ గెలుస్తుందని తేలింది. ఈ సర్వేల శాంపుల్ సైజు 50 వేల నుంచి 3లక్షల దాకా ఉంది. ఇంతమంది జనాల ఆధారంగా ఎవరు గెలుస్తారనేది జాతీయ మీడియా సంస్థలు అంచనా వేశాయి వీటి అంచనాలు కచ్చితంగా కాకపోయినా ఇంచుమించు నిజమవుతాయి. ఇన్ని సంస్థలు, ఇంతమంది ప్రజల అభిప్రాయాలను సేకరించిన ఫలితాలలో కాంగ్రెస్ ఎక్కడా కూడా విజయం సాధించే సూచనలు కనిపించలేదు. ఇది దేశ ప్రజలు గమనించాల్సిన ఒక కీలకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: