ఏపీ: జగన్ మంచోడు మంచోడు అనుకున్నాం.. ఇట్లాంటి అన్యాయాలు కూడా చేస్తారా?

Suma Kallamadi
రాజకీయాల్లో యూస్ అండ్ ధోరణి అడుగడుగునా కనిపిస్తుంది.. కొంతమందిని మాత్రమే రాజకీయ పార్టీలు చివరి వరకు అంటిపెట్టుకొని ఉంటాయి. అవసరం తీరిపోతే పక్కన పడటం పొలిటిషన్లకు అలవాటే. ఎన్నికల అప్పుడు కార్యకర్తలు పొలిటిషన్లకు బాగా అవసరమవుతారు. మిగతా సమయంలో వారు కావాలనుకున్నా వీరు కలిసే అవకాశం ఉండదు. ఎన్నికల సమయంలో లక్ష మంది కార్యకర్తల బలం కనిపిస్తుంది మిగతా సమయంలో 50 మంది కార్యకర్తలు కూడా కనిపించరు. అలా మిగిలిన వారు తమ కుటుంబాల కంటే వైసీపీని తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారిని తమ గుండెల్లో పెట్టుకొని వారికోసం ఎంతో మంచి చేస్తుంటారు.
వైసీపీ ఈసారి కార్యకర్తలతో పాటు ఐప్యాక్ టీమ్‌పై పూర్తిగా ఆధారపడింది. అయితే పోలింగ్ అయిపోయిన వెంటనే ఐప్యాక్ టీమ్‌లోని 100 మందిని వైసీపీ నిర్దాక్షిణ్యంగా తొలగించిందట. ఓడిపోతామని తెలిసిన తర్వాత ల్యాప్ టాప్స్ వారి నుంచి వెనక్కి తీసుకొని జీతం కూడా ఇవ్వకుండా వెళ్ళగొట్టిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి ఇందులో నిజం ఎంతుందో తెలియ రాలేదు కానీ ఐప్యాక్ టీమ్‌ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా వైసీపీ తొలగించినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
 వైసీపీ పోలింగ్ అయిపోగానే ఐప్యాక్ టీమ్‌తో సహా సోషల్ మీడియా మేనేజ్మెంట్ టీమ్స్ ని కూడా వదిలేసిందా అనేది ఇప్పుడు చర్చినీయాంశంగా మారింది. టీడీపీ వారు నిజం చెప్పకపోవచ్చు. ఎందుకంటే వీరిద్దరూ బద్ధ శత్రువులు. వైసీపీ వారి పై బురదజల్లే రాజకీయాలు టీడీపీకి కొత్తేం కాదు కాబట్టి ఇందులో నిజ నిజాలు ఏంటో తేలాల్సి ఉంది. ఇకపోతే జగన్ ఇప్పుడు లండన్ టూర్ లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నికల రిజల్ట్ కి ముందే జగన్ తిరిగి ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు. జగన్ ఎన్నికల తేదీకి ముందే తనకు 151 అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంటు సీట్లు వస్తాయని ప్రకటించారు. ఆయన ధైర్యం వెనక కారణం ఏమై ఉంటుందో కానీ జగన్ మాత్రం తాను గెలిచేసినట్లే బాగా సంతోషంగా కనిపిస్తున్నారు టిడిపి వాళ్ళే ఓడిపోతామనే భయం లో ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: