ఎప్పుడూ విరుచుకుపడే ఆ వైసీపీ నేత ఇప్పుడు ఎందుకు సైలెంట్..??
పోలింగ్ రోజు మీడియా ముందు మాట్లాడారు కానీ ఆ తర్వాత వైసీపీ గెలవబోతుందని ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీన్ని బట్టి టీడీపీ గెలవబోతుంది అనే తత్వం ఆయనకి బోధపడిందా అనే ఆలోచనలను కొంతమంది చేస్తున్నారు. ఆర్కే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్, అనిల్ కుమార్ యాదవ్ వంటి వైసీపీ నేతలు టీడీపీ వాళ్లు చీటింగ్ చేశారని, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, రీపోలింగ్ పెట్టాలని కామెంట్లు చేశారు. కానీ కొడాలి నాని నోటి నుంచి ఒక్క ప్రకటన కూడా బయటికి రాలేదు. వైసీపీ ఓడిపోతుందని అతను నమ్మారా? అందుకే సైలెంట్ అయిపోయారా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ.
ఫలితాలు రాకముందే అరిచి గోల చేయడం వల్ల వచ్చేదేముంది? మౌనంగా ఉండే ఫలితాల ద్వారానే అందరికీ తన సత్తా చాటాలని ఆయన అనుకుంటున్నారా? అనేది ఆయనకే తెలియాలి. వైసీపీ మరోసారి 150కి పైగా సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని జగన్ అయితే ఒక బోల్డ్ ప్రకటన చేశారు. కొడాలి నాని కూడా జగన్ చెప్పినట్లు అలానే తమకు సీట్లు వస్తాయని ఒక ప్రకటన ఇచ్చి ఉండాలి. అది ఇవ్వకపోవడం వల్ల ఆయనకి గెలుపు పై నమ్మకం లేదని భావన ప్రజల్లోకి వెళ్లి పోతుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొడాలి నాని నమ్మటం వల్లే సైలెంట్ అయిపోయారు అని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎవరో గెలుస్తారు అనే భయంతో ఒకరు సైలెంట్ అయిపోయారని చెప్పడం అవివేకం.