తిర 'క్రాస్' ఓటింగ్: టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా పులి పులే.. కేశినేని నాని హ్యాట్రిక్ కొట్టేస్తారట..??

Suma Kallamadi
కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని మంచి పర్సనల్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్ అని చెప్పుకోవచ్చు. ఆయన గతంలో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో టీడీపీ మూడు ఎంపీ సీట్లు మాత్రమే తలుచుకుంది. ఆ సీట్లు గెలుచుకున్న వారి కేశినేని నాని ఒకరు. నిజానికి 2019లో విజయవాడలో ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు నిలుచుంటే ఆరుగురు ఓడిపోయారు. ఒక్కరు మాత్రమే గెలిచారు. ఆ ఒక్కరు గద్దె రామ్మోహన్, విజయవాడ (తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
అలాంటి నియోజకవర్గంలో ఎంపీగా గెలవడం అంటే మామూలు విషయం కాదు. మంచి పేరు ఉంటేనే, మనోడు మనకు మంచి చేస్తాడు అనుకుంటేనే ప్రజలు ఓట్లు వేస్తారు. అలాంటి మంచి పేరు తెచ్చుకున్నారు కేశినేని నాని. ఆయన విజయవాడను బాగా అభివృద్ధి చేశారు. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. కొద్దిగా కోపం ఎక్కువ కానీ ప్రజలకు మంచి చేయాలనే మనస్తత్వం ఎక్కువ. అందుకే ఆయనకు పోయినసారి వైసీపీకి చాలా గాలి ఉన్నప్పటికీ భారీ లెవెల్లో ఓట్లు పడ్డాయి. క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు.
నాని 2014లోనూ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2024లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగానే మళ్లీ పోటీ చేశారు. ఆయన గెలుస్తారా లేదా అనేది జూన్ నాలుగో తేదీన తేలనుంది. విజయవాడలో టీడీపీకి ఎక్కువ ఓట్లు పడుతుంటాయి. కానీ ఈసారి కేశినేని నాని కారణంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కేవలం నానిని చూసి విజయవాడ ప్రజలు వైసీపీకి కళ్ళు మూసుకుని ఓట్లు గుద్దినట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచే టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ పోటీ చేస్తున్నారు ఆయన నానికి తమ్ముడు అవుతారు. అయితే ఈసారి విజయవాడ ప్రజలను టీడీపీకే ఓట్లు వేసిన ఎంపీ ఓట్లు మాత్రం నానికే ఓట్లు వేసినట్లు చర్చ జరుగుతోంది. నాన్ కాంట్రవర్షల్ పర్సన్ మంచి చేస్తాడు, మనోడు అనే ప్రేమ ఇప్పటికే ప్రజలకు ఉన్నట్లు సమాచారం. దాంతో ఈ నేత హ్యాట్రిక్ సక్సెస్ లు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: