ఐదోసారి గెలుపు కోసం నాని.. క్రాస్ ఓటింగ్ ఏమైనా కొంప ముంచనుందా..?

Pulgam Srinivas
వైసీపీ పార్టీలో అత్యంత కీలక నేతల్లో కొడాలి నాని ఒకరు. ఈయన 2004 వ సంవత్సరంలో మొదటి సారి గుడివాడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఇక ఈయన మొదటి సారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన 2009 వ సంవత్సరం కూడా టీడీపీ పార్టీ నుండి గుడివాడ ప్రాంత ఎమ్మెల్యే సీటును దక్కించుకొని మరోసారి గెలిచాడు. ఇక ఆ తర్వాత ఈయన వైసీపీ పార్టీలోకి మారారు.

వైసీపీ పార్టీలోకి మారిన తర్వాత కూడా ఈయన గుడివాడ ప్రాంతం నుండి 2014 వ సంవత్సరం ఎమ్మెల్యే సీటును దక్కించుకొని మళ్లీ గెలిచారు. ఇక నాలుగవ సారి 2019 వ సంవత్సరం కూడా ఈయన గుడివాడ ప్రాంతం నుండి ఎమ్మెల్యే సీటును దక్కించుకొని మళ్లీ గెలిచాడు. ఇలా వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఈయన ఐదోసారి కూడా ఇదే ప్రాంతం నుండి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఇక నాని ని ఎలాగైనా ఓడించాలి అని మిగతా పార్టీలు చాలా శ్రద్ధ వహించాయి. గుడివాడ నుండి కూటమి అభ్యర్థిగా వెనిగండ్ల రాము బరిలోకి నిలవగా ... కాంగ్రెస్ పార్టీ నుండి వడ్డాడి గోవిందరావు బరిలో ఉన్నారు.

ఇక నాని నీ ఐదోసారి గెలవకుండా పార్టీలు అన్ని తీవ్ర కృషి చేశాయి. ఇక ఈయనకు మంచి ఫాలోయింగ్ ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కొంత వరకు క్రాస్ ఓటింగ్ వల్ల ఈయనకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా వరకు మిగతా పార్టీలు తమ పార్టీ ఎంపీ కి ఓటు వేయకపోయినా పర్లేదు కానీ మాకు ఓటు వేయండి అని చెప్పడం, అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈ పార్టీ కి పడే ఓట్లు కూడా నానికి కాకుండా టీడీపీ కే పడే అవకాశం ఉంది. అది కూడా నాని కి మైనస్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఇలా నాని కి పడాల్సిన కొన్ని ఓట్లు క్రాస్ ఓట్ల రూపంలో ఇతర పార్టీలకు పడడంతో ఈయన గెలుపు అవకాశాలు స్వల్పంగా తగ్గే ఛాన్స్ ఉంది మరి క్రాస్ పోర్ట్ కారణంగా నాని కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది తెలియాలి అంటే రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: