ఏపీ: ఇదిగో.. ఈ ఓవర్‌ యాక్షనే.. తగ్గించుకుంటే మంచిది?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ నమోదైంది. అది శుభ సూచికం. ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చే చర్యగా దీనిని అంతా చూస్తున్నారు. దీంతో ఓటర్లలో చైతన్యం వచ్చి పోలింగ్ బూత్ ల దాకా నడిపించిందని కేంద్ర ఎన్నికల సంఘం కూడా కితాబిచ్చింది. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో తమ వంతు ప్రయత్నం చేశాయి. అది ఫలవంతం అయింది.

ఇంత వరకు బాగానే ఉన్నా పల్నాడు జిల్లాలో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే.. మరోవైపు మారణ కాండ సాగింది. సత్తెన పల్లి, గురజాల ఇలా చాలా చోట్ల చోటు చేసుకున్న ఘటనలు చూసిన వారికి ఏం జరగుతుందో అర్థం కాలేదు. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి తిరుపతిలో కూడా ఉద్రిక్తతలు చెలరేగాయి. కడప జిల్లా జమ్ముల మడుగులో అగ్గి రాజుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణలు భీకర స్తాయిలో చోటు చేసుకున్నాయి.

ఇవన్నీ చూస్తుంటే ఏపీలో ఏం జరుగుతుంది అనే చర్చ మొదలైంది. సాధారణంగా పోలింగ్ రోజున గొడవలు సర్వ సాధారణం. కానీ ఇది పోలింగ్ కు పరిమితం కాలేదు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్డు పైకి రావడం వాహనాలు దహనం చేయడం.. ప్రత్యర్థులపై దాడులు చేయడం ఒక సినిమాలో మాదిరి ఇక్కడ సన్నివేశాలు కనిపిస్తున్నాయి.  పైగా మొత్తం అయిపోయిన తర్వాత మా ప్రభుత్వం వస్తే మీ సంగతి చూస్తాం అంటూ డైలాగులు కొట్టడం కూడా అక్కడక్కడ కనిపించింది.

అయితే ఎవరి ప్రభుత్వం వచ్చినా ఏం మారదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఘర్షణ పడి కేసులో ఇరుకున్న వారిని బయటకు తీసుకురావడం.. వారిని పరామర్శించడం జరుగుతాయి. మహా అయితే ప్రత్యర్థులను జైలుకి పంపుతారు. అంతే కానీ కనిపించిన వారందరనీ చంపేయరు కదా. ఒకవేళ చంపినా ఆ తర్వాత వీరు కూడా జైలు జీవితం అనుభవించాల్సిందే కదా. న్యాయస్థానంలో శిక్ష పడకుండా అధికార పార్టీ కాపాడలేదు అనే విషయాన్ని వీరంతా మరిచిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏమైది. దారుణాలు ఏమైనా చోటు చేసుకున్నాయా. శాంతి భద్రతలు క్షీణించాయా. రేపు భవిష్యత్తులో టీడీపీ వచ్చినా ఇదే జరగుతుంది. అందువల్ల అతి ఉత్సాహం మాటలు.. అతి ఊహలు వద్దు అని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: