ఏపీ ఎలక్షన్స్.. తొలి ఫలితం వచ్చేది ఇక్కడే?

praveen
ఏపీలో ఎన్నికల ఫలితాలపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. మే 13వ తేదీన 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి అన్న విషయం తెలిసిందే. అయితే అటు టిడిపి, జనసేన బిజెపి పార్టీలను కలుపుకొని.. కూటమిగా పోటీ చేస్తే.. కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకొని బలులో దిగింది. అయితే అధికారంలో ఉన్న వైసిపి పార్టీ మాత్రం ఒంటరిగానే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతుంది. ఈ క్రమంలోనే ఈసారి అధికారం ఎవరికి దక్కబోతుంది అనే విషయంపై మాత్రం తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది.

 అయితే ఏపీలో ఈసారి పోలింగ్ శాతం కూడా పెరగడంతో ఈ పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి ప్లస్ కాబోతుంది అన్న విషయం గురించి కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఎన్నో సర్వే రిపోర్టులు తెరమీదికి వచ్చి సంచలనంగా మారిపోయాయి. ప్రజలందరినీ కూడా మరింత కన్ఫ్యూజన్లో పడేసాయ్. ఎందుకంటే కొన్ని సర్వే రిపోర్టులు కూటమి గెలుస్తుందని చెబితే మరికొన్ని రిపోర్టులు అటు వైసిపి మరోసారి అధికారాన్ని చేపడుతుందని చెప్పకనే చెప్పాయి. అయితే ప్రజలు ఏం నిర్ణయించారు అన్న విషయం మాత్రం జూన్ 4వ తేదీన కౌంటింగ్ తర్వాత ఫలితాలలో తేలబోతుంది అని చెప్పాలి.

 అయితే కౌంటింగ్ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. కౌంటింగ్ సమయంలో ఫలితాలను తారుమారు చేసే అవకాశము ఉండడంతో అందరూ అప్రమత్తమయ్యారు. అయితే రాష్ట్రంలో తొలి ఫలితం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు లేదా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలోను 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి, అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఫలితాలు చివరిగా వెలువడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ రెండు స్థానాలలో దాదాపు 29 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. వీటితోపాటు భీమిలి,  పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: