మామ అల్లుళ్ళ పోరులో.. ఈసారి గెలుపు ఎవరిదో?

praveen
ఏపీలో ఈసారి అధికారాన్ని చేపట్టబోయే పార్టీ ఏది అనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది అన్న విషయం తెలిసిందే. అయితే నేటి నుంచి కౌంట్ డౌన్ మొదలు కాబోతుంది. నేడు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతూ ఉండడంతో.. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలలో అధికారం ఎవరిది అన్న విషయం బయటపడపోతుంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వార్ వన్ సైడ్ అనే నియోజకవర్గాల విజయాలపై పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీకొన్ని సర్వేల రిపోర్టుల ఆధారంగా టాప్ ఫైట్ అంటూ చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిది అనే విషయం గురించి మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు.

 అలాంటి నియోజకవర్గాలలో శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ మామ అల్లుళ్ళ మధ్య పోరు జరుగుతూ ఉండడంతో.. ఇక ఫలితం పై మరింత ఆసక్తి పెరిగిపోయింది. అయితే ఇక్కడ మామ అల్లుళ్ళ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని ఇప్పటికి రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. అధికార వైసీపీ నుంచి మూడోసారి బరిలోకి దిగారు పార్టీ సీనియర్ నేత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. 2014లో ఆయన సమీప టిడిపి అభ్యర్థి మేనల్లుడు అయిన కూన రవికుమార్ పై 5449 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోను మరోసారి మేనమామ మేనల్లుడు తలబడ్డారు. ఈసారి విజయం మేనమామ తమ్మినేని సీతారాం వైపు నిలిచింది. 13 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో రవికుమార్ పై సీతారాం విజయం సాధించారు.

 అయితే ఇక ఇప్పుడు 2024 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ఈ మామ అల్లుళ్ళ పోరు జరిగింది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి చేపట్టి ఇక రాజకీయాలనుంచి రిటైర్మెంట్ తీసుకొని తన వారసుడిగా కుమారుడిని బరిలోకి దింపాలని సీతారాం ఇప్పటికే ప్లాన్ వేసుకున్నారు. దీంతో ఈసారి గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే మామకు తగ్గ వారసుడు మేనల్లుడు అయిన కూననే అనే ఆముదాలవలస ప్రజానికం నమ్మితే మాత్రం రవి కుమార్ వైపే విజయం ఉండే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండడంతో.. ఎవరు గెలుస్తారు అనే విషయంపై రాజకీయ నిపుణులు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: