జోగి ర‌మేష్: జూన్‌ 4న చంద్రబాబు ఆస్పత్రిలో చేరడం గ్యారెంటీ ?

Veldandi Saikiran

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ టూర్‌ పై మంత్రి జోగి రమేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 10 రోజులు ఏ దేశానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు?  దోచుకున్న డ‌బ్బును దాచేందుకు విదేశాల‌కు వెళ్లారా?  అంటూ నిలదీశారు. చంద్రబాబు పర్య‌ట‌న‌పై ఇంత దాప‌రికం ఎందుకు అంటూ ప్రశ్నించారు మంత్రి జోగి ర‌మేష్. చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్న అంటూ చురకలు అంటించారు.

ఏ దేశానికి వెళ్ళాడో.. ఎక్కడికి వెళ్ళాడో పార్టీ నేతలకు సైతం తెలియదని సెటైర్లు పేల్చారు. విదేశీ పర్యటన ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి..? అని నిలదీశారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బులు దాచుకోడానికి వెళ్లాడు కనుకే ఇంత రహస్యం అంటూ నిప్పులు చెరిగారు.
Ab వెంకటేశ్వరావు టిడిపి తొత్తు కాదా..? అని ప్రశ్నించారు.

పరికరాల కొనుకోలు స్కాం లో కేంద్ర నిఘా వ్యవస్థ కూడా abv పాత్ర ఉందని నిర్ధారించిందని వెల్లడించారు. Abv వంటి పై బట్టలు మాత్రమే ఖాకీ.. లోపల అంతా యెల్లోనే అంటూ ఫైర్‌అయ్యారు మంత్రి జోగి రమేష్. Abv చరిత్ర ప్రజలకు తెలుసు.. నిన్నటితో మరింతగా నిజస్వరూపం బయటపడిందని ఆగ్రమించారు. Exit పోల్స్ తో కూటమి దిమ్మ తిరిగి బొమ్మ కనబడబోతుంది.

జూన్ 4 తేదీన చంద్రబాబుకు మూర్ఛ వచ్చి హాస్పిటల్ లో చేరడం తథ్యం అంటూ బాంబ్‌ పేల్చారు మంత్రి జోగి రమేష్. వైసీపీ మళ్ళీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం అన్నారు. వైసిపి శ్రేణులంతా సంబరాలకు సిద్దం అవ్వండి అని పిలుపునిచ్చారు మంత్రి జోగి రమేష్. సీ ఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి ఏపీ ముఖ్యమంత్రి కాబోతున్నారని వెల్లడించారు మంత్రి జోగి రమేష్. అన్ని ఫలితాలు వైసీపీకి అనుకూలంగానే ఉంటాయని చెప్పారు మంత్రి జోగి రమేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: