First Step Survey: ఏపీలో ఆ పార్టీకే 124 సీట్లు పక్కా..వార్‌ వన్‌ సైడ్‌ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరూ ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇవాళ  ఎగ్జిట్ పోల్స్ వస్తున్న నేపథ్యంలో... రకరకాల సర్వే సంస్థ అంచనాలను వెల్లడిస్తున్నాయి. పోస్ట్ పోల్ అలాగే ప్రీ పోల్ అంటూ... ఏవేవో సర్వే రిపోర్ట్ లను వెల్లడిస్తున్నాయి. అయితే తాజాగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై... ఫస్ట్ స్టెప్  అనే సర్వే సంస్థ... పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్  ను వెల్లడించింది.

 
ఈ పోస్ట్ పోల్ సర్వే ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఈ ఫస్ట్ స్టెప్ సర్వే సంస్థ తెలిపింది. ఓటింగ్ శాతంతో పాటు... ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేదానిపై కూడా అంచనా వేసింది. మరి ఒకసారి ఆ సీట్ల వివరాలు అలాగే పర్సంటేజీలు పరిశీలిస్తే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి...  114 అసెంబ్లీ స్థానాల నుంచి 124 స్థానాలు వస్తాయట. ఓటింగ్ పర్సెంట్  49.5% వైసిపి పార్టీకి వస్తుందని... ఈ రిపోర్టులో వెళ్లడైంది.


 అటు తెలుగుదేశం కూటమి పార్టీలకు 50 నుంచి 60 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయట. 45.5%... కూటమి పార్టీలకు ఓటింగ్ శాతం వస్తుందట. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక సీటు గెలుస్తుందట. అది ఎంపీ సీటు అని సమాచారం.  ఇక ఒకసారి పార్లమెంట్ స్థానాలను పరిశీలిస్తే.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ 17 నుంచి  20 ఎంపీ స్థానాలను గెలుచుకోనుందట.

 
తెలుగుదేశం కూటమి ఐదు నుంచి 8 స్థానాలను గెలుచుకునే ఛాన్స్ ఉందని ఈ సర్వే వెల్లడించింది. ఇందులో తెలుగుదేశం కూటమికి మూడు నుంచి ఐదు స్థానాలు వస్తాయట. జనసేన పార్టీకి ఒకటి నుంచి రెండు సీట్లు వస్తాయట. బిజెపి పార్టీకి ఒకటి నుంచి రెండు సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. గోదావరి జిల్లాలలో ఏకంగా 35 స్థానాలు ఉండగా.. అందులో వైసిపి 18 సీట్లు గెలుస్తుందట. తెలుగుదేశం పార్టీకి 17 ఎమ్మెల్యే స్థానాలు దక్కుతాయి అంట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: