జగన్ గెలుపుపై.. షర్మిల రిపోర్ట్.. కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ?

praveen
ఏపీలో ఈసారి సీఎం పీఠం ఎవరిది? మళ్ళీ జగనే సీఎం అవుతాడా.. లేకపోతే కూటమి గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? ఇక పార్లమెంట్ ఎన్నికలలో మెజారిటీ స్థానాలలో విజయం సాధించే పార్టీ ఏది? ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసిన కూడా ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే ఏపీ రిజల్ట్ పై తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఆసక్తి నెలకొనడం గమనార్హం. అయితే ఇలా ఏపీ ఫలితాలపై జాతీయస్థాయిలో కూడా ఆసక్తి నెలకొనడానికి అటు కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుత అధికార వైసిపి ఎన్డీఏ కూటమిలో కానీ అటు ఇండియా కూటమిలో కానీ లేకపోవడం ప్రధాన కారణం అని చెప్పాలి.

 కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తే.. టిడిపి బిజెపి, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసింది. కానీ అటు జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేశారు. గెలుపు పై కూడా ధీమాగానే ఉన్నారు. 151 ఎమ్మెల్యేలు,  22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువగానే వస్తాయని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు వైసిపి పార్టీ నేతలు. అయితే జగన్ గెలిచే ఎంపి స్థానాలపై హస్తీనాలోని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఆరా తీసినట్లు తెలుస్తోంది. జగన్ గెలుచుకునే ఎంపీ స్థానాలపై నివేదిక ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న జగన్ చెల్లెలు షర్మిలను కాంగ్రెస్ పెద్దలు కోరారట.

 ఈ క్రమంలోనే హై కమాండ్ ఆదేశాల మేరకు షర్మిల తో పాటు ఏపీలో హై కమాండ్ కు అత్యంత సన్నిహిత నేత ఒకరు కలిసి ఏపీలో రాబోయే ఫలితాలపై రిపోర్ట్ ఇచ్చారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ నివేదికలో ఏపీలో జగన్ వైపే సానుకూలత ఉందని గతంలో వచ్చిన ఎంపీ స్థానాలలో ఒకటి రెండు స్థానాలు అటు ఇటుగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని.. ఇక నివేదికలో ఉందట. అదే సమయంలో ఇండియా కూటమికి జగన్ మద్దతు ఉండబోదని నివేదికలో నొక్కి చెప్పినట్లు సమాచారం. అయితే అటు కేంద్రంలో ఇండియా, ఎన్డీఏ కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు నేపథ్యంలో ఏపీ నుంచి వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే.. కేంద్రంలో చక్రాలు తిప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: