జగమంత జగన్: రెండు సెకండ్ల వీడియోతో కూటమికి చుక్కలు.. వాట్ ఏ కాన్ఫిడెంట్..?

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిన్నటి రోజున i-pac సంస్థతో మాట్లాడి తమ పార్టీ గెలుపు కోసం కష్టపడినా ఈ సంస్థకు సైతం కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్నటి రోజున మాట్లాడడం జరిగింది జగన్.. అయితే ఇక్కడ జగన్ మాట్లాడుతూ.. 151 అసెంబ్లీ సీట్లు దాటుతాయని.. కాన్ఫిడెన్స్ తో తెలియజేశారు. జగన్ చుట్టూ ఉన్నటువంటి వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. సుమారుగా రెండున్నర లక్షల శాంపుల్స్ తీసుకొని ఒక సర్వే.. మొత్తం 5 రకాల సర్వేలను సైతం చేశారట. వాటన్నిటిని ఓకే చోట సేకరించి ముగ్గురు నలుగురు పెద్ద నేతలను తీసుకుని పక్కా ప్రణాళికతో పోల్ మేనేజ్మెంట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అందులో ప్రధానమైనటువంటి అంశము.. మహిళలలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో.. వాళ్లల్లో 60 నుంచి 62 శాతం మంది వైసిపి పార్టీకి ఓటు వేశారనీ జగన్ కి ఉన్న సమాచారం.. అలాగే పురుషులలో 38 నుంచి 45% మంది ఓటింగ్ వేసారని తెలుస్తోంది. మహిళలతో పోల్చుకుంటే పురుషులు కాస్త తక్కువ వేశారు. ముఖ్యంగా మద్యం ప్రభావం, ఇతరత్రా ప్రభావాలు అయ్యుండవచ్చు. ఎవరైతే కాపు (OC )సామాజిక వర్గాలు ఉన్నారా..EBC మహిళల్లో కూడా 50 నుంచి 60% వరకు ఓటు వేశారు.

ఒక కోటి 45 లక్షల కుటుంబాలకు EBC నేస్తమా, కాపు నేస్తమా, లా నేస్తమా.. చేయూత, ఆసరా ఏదో ఒక పథకం వల్ల బెన్ఫిట్ పొందినటువంటి వాళ్లలో 60 నుంచి 65% ఓటు వేశారు.. ఈ కోటి 45 లక్షల కుటుంబాల లెక్కలు వేసుకుంటే.. రెండు కోట్ల 80 లక్షల మంది వరకు ఈ బెనిఫిట్స్ ఏదో ఒక రూపంలో పొందినారు. ఇందులో తమకు 60 శాతం వరకు పడ్డాయని ధీమా వైసీపీ పార్టీలో ఉన్నది. అదే జగన్ కు ఉన్న ధీమా అని చెప్పవచ్చు.. ఆ ఉద్దేశంతోనే ఎక్కడెక్కడ ఐదువేల ఓట్ల తేడాతో గెలుస్తారు.. ఎక్కడెక్కడ పదివేల ఓట్ల తేడాతో గెలుస్తారని .. ఎక్కడెక్కడ భారీ విజయాలు ఉంటాయనేవి ఈ లెక్కలన్నీ కూడ సేకరించారు అన్నది ఆయన దగ్గర ఉన్న సన్నిహితుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: