ఆరోజు.. ఎంతో ఆందోళనకు గురయ్యా : కోహ్లీ

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి కొత్తగా క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అందరిలాగానే సాదాసీదా క్రికెటర్ గా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. తన ఆట తీరుతో అందరికి సుపరిచితుడుగా  మారిపోయాడు. ఇక వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది లెజెండరీ క్రికెటర్స్ సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టేసిన విరాట్ కోహ్లీ.. ఇక వరల్డ్ క్రికెట్లో అందరికీ ఫేవరెట్ గా మారిపోయాడు అని చెప్పాలి. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుచుకుంటూ ఉంటారు.

 అయితే సాధారణంగా చేజింగ్ చేస్తున్న సమయంలో.. ఆటగాళ్లు ఒత్తిడితో తడబాటుకు గురవడం చూస్తూ ఉంటాం. కానీ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఇది రివర్స్ లో ఉంటుంది. చేజింగ్ చేస్తున్న సమయంలో ఎంత ఒత్తిడి ఉంటే కోహ్లీ నుండి అంత అత్యుత్తమ ప్రదర్శన వస్తూ ఉంటుంది. అందుకే కొంతమంది క్రికెట్ ప్రేక్షకులు కోహ్లీని చేజింగ్ కింగ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అతన్ని చూస్తుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు అయినా కోహ్లీకి అసలు ఒత్తిడి అనిపించదా అనే భావన కలుగుతూ ఉంటుంది. అయితే ఒకానొక సమయంలో తాను తీవ్ర ఆందోళనకు గురయ్యాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.

 2011లో బంగ్లాదేశ్ పై తన మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో.. తీవ్రమైన ఆందోళనకు గురయ్యాను అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇటీవల స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ లో దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది. అదో గొప్ప విషయం. అప్పటి జట్టులో నేనే యంగెస్ట్ ప్లేయర్ గా ఉన్నాను. అందుకే మ్యాచ్ కి ముందు రోజు రాత్రి ఎంతో ఆందోళనకు గురయ్యా. ఇది నిజంగా నిజమే అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే ఆ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ.. 83 బంతుల్లోనే అజేయమైన సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: