పవన్ vs గీత: గెలవడం గొప్పకాదు.. గెలిచిన తర్వాత చేయడమే గొప్ప..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయి ఇప్పటికి 18 రోజులు పైన కావస్తున్న ఫలితాలు ఈనెల నాలుగవ తేదీన వెలువబడునున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎక్కువగా వినిపించిన పేర్లలో పిఠాపురం కూడా ఒకటి.. ముఖ్యంగా ఇక్కడ టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే అందుకు ప్రత్యేకంగా కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడ చాలా బలంగా ఉన్న మహిళ నేత వంగా గీత కూడా వైసిపి పార్టీ నుంచి పోటీ చేయడంతో ఎవరు గెలుస్తారని విషయం పైన ఎగ్జైటింగ్ గా ఎదురు చేస్తున్నారు.

అయితే పిఠాపురంలో ఓటింగ్ అయిపోయినప్పటి నుంచి ఎక్కువగా బెట్టింగ్ ఇతరత్రా అంశాల పైన ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం నెంబర్ ప్లేట్ల పైన కూడా ఎమ్మెల్యే తాలూకా అనే స్టిక్కరింగ్ కూడా వైరల్ గా మారింది. ఇప్పుడు తాజాగా ఎగ్జి ట్ పోల్స్ కంటే ముందుగానే వికీపీడియాలో పిఠాపురం ఫలితాల పైన ఎడిటింగ్ చేసి పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలుపు అన్నట్లుగా తెలుపుతున్నారు... ఇదంతా ఇలా  ఉంటే వైసిపి నాయకులు కూడా వంగా గీత గెలిచింది అంటూ ఎడిటింగ్లో చేస్తూ ఉన్నారు.

అయితే ఇక్కడ గెలవడం ముఖ్యం కాదు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశారన్నది ముఖ్యము.. గెలుపు అనేది ఎప్పుడో ఒకసారి కచ్చితంగా వస్తుంది.. కానీ మంత్రి అయిన తర్వాత ఏం చేశారన్నది అక్కడ కీలకమైన పాయింట్.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంకు ప్రత్యేకించి కొన్ని హామీలు ఇచ్చినట్లుగా సమాచారం.. అలాగే టిడిపి మేనిఫెస్టోలో ఉండేటివన్నీ కూడా అమలు చేసేలా సాధ్యం చేస్తానని కూడా మాట ఇచ్చారు ఏపీ ప్రజలకు. మరి పిఠాపురంలో అధినేతగా ఉన్న జనసేన నేత పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా సాధారణ మహిళగా పేర్కొందిన వైసీపీ ఎమ్మెల్యే వంగా గీత గెలుస్తారా అనే విషయం జూన్ 4వ తేదీన తెలియబోతోంది. ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: