జగమంత జగన్: పోలింగ్ వార్ వన్ సైడేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు అధికారం ఏ పార్టీకి సూచిస్తోంది అనే ప్రశ్న నిన్నటి రోజు నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఎక్కువగా వైసిపి పార్టీకి అనుకూలంగా ఉన్నాయనే వార్తలు అయితే చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అందుకు గల కారణాలు ఏమిటంటే పోల్ మేనేజ్మెంట్ ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయాలు చాలా సులువుగా అర్థమవుతాయి. ఐదేళ్లపాటు ఏపీకి జగన్ సీఎం గా ఉండగా మరో ఐదేళ్లు కూడా ఆయననే కొనసాగించేలా ప్రజలు కోరుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

రూరల్ అర్బన్ ఏరియాలలో పథకాల ప్రయోజనాలు పొందిన వారే మళ్లీ జగన్ని సీఎం చేయాలని భావిస్తున్నారట.. వైసిపి అభ్యర్థులు పట్టు వీడకుండా చివరి నిమిషం వరకు ప్రచారం చేస్తూ ఉండడం పార్టీకి బాగా కలిసి వచ్చింది. దీంతో మళ్ళీ సిఎం జగన్ అయితే మాత్రం ఇప్పటివరకు అమలైన పథకాలు అలాగే కొనసాగుతూ ఉంటాయని ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు మహిళలు రాష్ట్రంలో క్యూ కడుతూ మరి ఓటు వేయడానికి బారులు తీరారు.. అలాగే వృద్ధులు మహిళలు కూడా రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

మహిళల ఓట్లు ,వృద్ధులు, సంక్షేమ పథకాలు పొందిన వారందరూ కూడా వైసిపి పార్టీకి అనుకూలంగా ఉన్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసిపి ఇలాంటి కంచి కోటలు కలిగి ఉన్న నియోజకవర్గాలు చాలానే ఎక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే అలాంటి కంచుకోటలో టిడిపి పార్టీ చెక్ పెట్టే అవకాశం ఎక్కడ కనిపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. చాలాచోట్ల సగానికి పైగా ఓట్లని వైసీపీకి పార్టీకే పడినట్లుగా తెలుస్తోంది.. గతంలో వైసిపి కూటమి చాలా టైప్ ఫైట్ గా ఉంటుందని భావన అందరిలో ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న ఎన్నికల పరిస్థితిని చూస్తే అవన్నీ మారిపోయాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి మరొకసారి వైసీపీ పార్టీ వార్ వన్ సైడ్ చేసి  అధికారంలోకి వస్తే ఈసారి జగన్ ప్రధానంగా అభివృద్ధి పైన ఎక్కువగా ఫోకస్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: