ఖమ్మం ఓటర్ పల్స్.. మంత్రి వియ్యంకుడిదే విజయమట?

praveen
నేటి ఉదయం నుంచి తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరికొంత సేపట్లో ఈ పోలి ముగియనుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటి వరకు ప్రచారంలో దూసుకుపోయిన అభ్యర్థుల భవితవ్యాన్ని అటు ఓటర్లు  తేల్చేశారు.. ఇక ఇప్పటికే దాదాపుగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో.. ఇక ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో విజయం ఎవరిని వరించబోతుంది అనే విషయంపై ఎన్నో ఊహాగానాలు కూడా తెరమీదకి వస్తున్నాయి అని చెప్పాలి. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో విజయం ఎవరిని వరించబోతుంది  అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

 తన వియ్యంకుడు అయిన రామసహాయం రఘురాం రెడ్డికి పట్టుబట్టి మరి ఖమ్మం ఎంపీ టికెట్ ఇప్పించుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇక ఈ ఎన్నికల్లో పంతం నెగ్గించుకున్నట్లుగానే కనిపిస్తుంది  ఎందుకంటే ప్రస్తుతం దాదాపుగా పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో.. నిపుణుల అంచనాల ప్రకారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అయితే దీని వెనుక కారణం కూడా లేకపోలేదు. రఘురామిరెడ్డి వరంగల్ కి చెందిన మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు కావడంతో ఇక బలం అర్థబలం రెండు కలిగి ఉన్నారు.

 దానికి తోడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండడం... ఇక ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండడం.. ఇక రఘురామిరెడ్డికి ఎంతగానో కలిసి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా పాతిక వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించారు. ఇంకోవైపు అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రఘురామిరెడ్డి విజయం బాధ్యతలను భుజాన వేసుకొని మరి ప్రచారం చేశారు. అయితే ఖమ్మం అటు బిఆర్ఎస్ పార్టీకి సెట్టింగ్స్ స్థానం అనే విషయం తెలిసిందే.

 ఇక్కడి నుంచి నామా నాగేశ్వరరావుని బలిలోకి దింపారు కేసీఆర్. సెట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృశ్య బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామ పార్లమెంట్ అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదు అనే వ్యతిరేకత కూడా ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో  ఖమ్మంలో బిఆర్ఎస్ పట్టు కోల్పోవడం కూడా పార్టీ ఓటమికి కారణమవుతున్నాయట. అయితే ఇప్పుడు వరకు అసలు ఖమ్మంలో క్యాడర్ లేని కాషాయ పార్టీ  తాండ్ర వినోద్ రావును బరిలోకి దింపింది. దీంతో ఓటర్లను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఇక కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డిదే విజయం అని కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: