బీజేపీ ఎంపీ కంగనా చెంప పగలగొట్టిన జవాన్ కు బంపరాఫర్?

Purushottham Vinay
ఎప్పుడు వివాదాలతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యే వాళ్లలో బాలీవుడ్ హీరోయిన్ బీజేపీ ఎంపీ కంగనా ముందు వరుసలో ఉంటుంది. అందుకే ఓ లేడీ జవాన్ ఈమె చెంప పగలగొట్టింది. దీంతో ఆ జవాన్ పై వేటు పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుంది. ఆమె ఉద్యోగం పోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఒకవేళ ఆమెకు ఉద్యోగం పోతే తనకు మంచి జాబ్ ఇస్తానని బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ విశాల్ దడ్లని జై జవాన్ జై కిసాన్ అంటూ ముందుకు వచ్చాడు. తన గొప్ప మనసు చాటుకున్నాడు.

''చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ఏదో జరిగిందని మీడియా ద్వారా నాకు తెలిసింది. కంగనా మొబైల్, పర్సు చెక్ చేసిన సమయంలో ఈ సంఘటన జరిగిందని నాకు అర్థమైంది.మహిళలు వంద తీసుకుని రైతుల నిరసనలో పాల్గొన్నట్లు కంగనా అన్నదానిపై నా సోదరి మానసికంగా చాలా కోపంతో ఉంది. ఇక అదే ఈ సంఘటనకు దారి తీసింది. సైనికులు, రైతులు ఇద్దరూ కూడా ముఖ్యమైనవారు. అన్ని విధాలుగా వారు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ విషయంలో మేం ఆమెకు పూర్తి మద్దతుగా ఉంటాం'' అని కంగనా రనౌత్‌ను చెంప పగలగొట్టిన వీర వనిత సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చర్యను ఆమె సోదరుడు రైతు నాయకుడు, పంజాబ్‌లోని కపుర్తలా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యదర్శి అయిన షేర్ సింగ్ మహివాల్ మెచ్చుకుంటూ తన సోదరికి మద్దతుగా నిలిచాడు.

ఇది ఇలా ఉంటే హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా చెంప పగల కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ చర్యను పంజాబ్‌కు చెందిన ఒక వ్యాపారి కూడా సమర్థించడం జరిగింది. మొహాలీలోని జిరాక్‌పూర్‌కు చెందిన బిజినెస్‌ మ్యాన్‌ శివరాజ్ సింగ్ బెయిన్స్ ఆమెకు ఏకంగా లక్ష రివార్డు ప్రకటించాడు. పంజాబీ ప్రజలు ఇంకా పంజాబీ సంస్కృతిని రక్షించిన కుల్విందర్ కౌర్‌కు ఆయన సెల్యూట్ చేశాడు.

ప్రస్తుతం కంగనా చెంపని పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నది. ఆ లేడీ జవాన్ కి నెటిజన్స్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ లభిస్తుంది.నిన్న చండీఘడ్ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ చెంపదెబ్బ కొట్టింది. కేంద్రప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతంలో ఆందోళనలకు దిగిన మహిళా రైతుల గురించి కంగనా అర్ధం పర్ధం లేకుండా చెడుగా మాట్లాడినందుకు ఆ లేడీ జవాన్ ఇలా చెంప పగలగొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: