చంద్రబాబు ప్రమాణస్వీకారంలో చేసే సంతకాలు ఇవే..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో కూటమి భారీగా విజయాన్ని అందుకుంది. అయితే ముఖ్యంగా టిడిపి పార్టీ జనసేన పార్టీ మూకుమ్మడిగా మేనిఫెస్టోను విడుదల చేశారు. దీంతో కచ్చితంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే తమ కూటమి ప్రకటించిన హామీలను సైతం నెరవేరుస్తామంటూ తెలియజేశారు. ఇప్పుడు ఎట్టకేలకు కూటమి అధికారంలోకి రావడంతో మేనిఫెస్టో పైన పలు రకాల సందేహాలు సైతం వినిపిస్తూ ఉన్నాయి ప్రజలకు. గతంలో కూడా చంద్రబాబు ఎలాంటి హామీలను నెరవేర్చ కుండా ప్రజలను మోసం చేశారు కానీ పవన్ కళ్యాణ్ నమ్మి ఈసారి కూటమిని అధికారంలోకి వచ్చేలా చేశారు ప్రజలు.

అయితే చంద్రబాబు నాయుడు ఈనెల 12వ తేదీన ప్రమాణస్వీకారం అమరావతిలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.. ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మూడు సంతకాలు కొన్నిటిపైన చేసే విధంగా ప్లాన్ చేసినట్లు టిడిపి నేతలు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. మొదట మెగా డీఎస్సీ పైన తొలి సంతకం ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఆ తర్వాత సంతకాన్ని ల్యాండ్ టైటిల్ చట్టం పైన చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి మూడో సంతకం 4000 రూపాయల పెన్షన్ పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.అది కూడా ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తానని ఇవ్వడంతో ప్రజలు సైతం ఎక్కువగా కూటమికి ఓటు వేసినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ విషయాన్ని మాత్రం ఎవరూ కూడా అధికారికంగా తెలియజేయలేదు. కేవలం టిడిపి నేతలు కార్యకర్తలు మాత్రం అక్కడక్కడ సోషల్ మీడియాలో వీటిని వైరల్ గా చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు అన్నట్టుగానే తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటన్నిటినీ కూడా అమలు చేస్తారా లేదా అనే విషయం మరొ కొద్ది రోజులలో తేలుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల సైతం కచ్చితంగా హామీలను అమలుచేసి తీరేలా చూస్తారని ధీమాతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: