నావల్ల విజయ్ దేవరకొండ ఇబ్బంది పడ్డాడా... రవిబాబు..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రవి బాబు ఒకరు . ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో కొన్ని మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమ లో దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . అలాగే అనేక సినిమాలలో నటుడి గా నటించి కూడా ఆయన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకొని నటుడిగా కూడా తెలుగు సినీ పరిశ్రమ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇకపోతే తాజాగా ఈ నటుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు . అందులో భాగంగా ఈయన విజయ్ దేవరకొండ తో తనకు విభేదాలు ఉన్నాయి అని వస్తున్న వార్తలపై స్పందించాడు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రవి బాబు మాట్లాడుతూ... నేను చాలా సంవత్సరాల క్రితం నువ్విలా అనే సినిమాకు దర్శకత్వం వహించాను. ఆ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇకపోతే ఆ సినిమాలో ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ఓ చిన్న పాత్రలో నటించాడు. ఇక నువ్విలా సినిమా సమయంలో నా వల్ల విజయ్ దేవరకొండ హర్ట్ అయ్యాడు అని అంటున్నారు. ఇక నువ్విలా సినిమా తర్వాత మేమిద్దరం కలిసి సినిమాలు చేశాం. ఒక వేళ నా వల్ల ఆయన గనుక హార్ట్ అయి ఉంటే మళ్లీ మేమిద్దరం కలిసి నటించే వాళ్ళమా , మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు కాబట్టి మళ్ళీ మేమిద్దరం కలిసి నటించాం అని రవి బాబు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: