తెలుగు సినీ పరిశ్రమలో మంచు గుర్తింపు కలిగిన నటిమానులలో సునయన ఒకరు. ఈమె కుమారి VS కుమారి , టెన్త్ క్లాస్ , రాజ రాజ చోర వంటి తెలుగు సినిమాలలో నటించింది. ఈ ముద్దు గుమ్మ నటించిన ఈ సినిమాలలో శ్రీ విష్ణు హీరో గా రూపొందిన రాజ రాజ చోరా మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఈ సినిమాలతో పాటు ఈమె ఇన్స్పెక్టర్ ఋషి , మీట్ క్యూట్ , చదరంగం వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
ఈ వెబ్ సిరీస్ లలో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన ఇన్స్పెక్టర్ ఋషి వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈమె కేవలం తెలుగు సినిమాలు , వెబ్ సీరీస్ లు మాత్రమే కాకుండా ఈమె అనేక తమిళ , కన్నడ , మలయాళ సినిమాలలో కూడా నటించి ఆ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.
ఇలా సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. అందుకు సంబంధించిన విషయాన్ని ఈ ముద్దుగుమ్మ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ బ్యూటీ తనకు ఈ మధ్య కాలంలోనే ఎంగేజ్మెంట్ జరిగినట్లు వెల్లడిస్తూ సోషల్ మీడియాలో రింగులు మార్చుకుంటున్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది.
ఇక ఈ బ్యూటీ తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు ధృవీకరిస్తూ రింగులు మార్చుకుంటున్న ఫోటోను పోస్ట్ చేసింది కానీ , తాను చేసుకోబోయే వ్యక్తి ఎవరు, అతను ఏం చేస్తుంటాడు ఇలా ఎలాంటి వివరాలను కూడా ఈ ముద్దుగుమ్మ బయట పెట్టలేదు. ఇక మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన వివరాలను ఈ నటి బయటపెడుతుందేమో చూడాలి. ఇక తాజాగా ఈ బ్యూటీ తన ఎంగేజ్మెంట్ కు సంబంధించిన అప్డేట్ ను తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.