ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన సత్యం రాజేష్ లేటెస్ట్ మూవీ..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సత్యం రాజేష్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో కమీడియన్ పాత్రలలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో కమీడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా చాలా సంవత్సరాల పాటు కమీడియన్ గానే కెరీర్ ను కొనసాగించిన ఈ నటుడు ఈ మధ్య కాలంలో కొన్ని సీరియస్ పాత్రలలో , హీరో పాత్రలలో కూడా నటించాడు.

ఎవరైనా ఈ సినిమాను థియేటర్లో చూద్దాం అని మిస్ అయిన వాటి ద్వారా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈయన మా ఊరి పొలిమేర అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అయినప్పటికీ దీనికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ఈ మూవీ కి కొనసాగింపుగా మా ఊరి పొలిమేర 2 అనే సినిమా రూపొందింది. ఈ మూవీ నేరుగా థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో హీరోగా రాజేష్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

ఇకపోతే తాజాగా ఈ నటుడు పేరెంట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. థియేటర్లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్  లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఓ టి టి ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో , ఏ రేంజ్ రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: