నేను స్టార్ హీరోలతో అందుకే సినిమాలు చేయలేదు... రవిబాబు..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడి గా , నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో రవి బాబు ఒకరు . ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు.  ఎన్నో మూవీ లలో నటించాడు . ఇకపోతే ఈయన తన కెరియర్ లో ఎక్కువ శాతం చిన్న హీరోలతో , కొత్త హీరోలతోనే సినిమాలు చేశాడు. వాటితోనే విజయాలను అందుకున్నాడు . అపజాయలను అందుకున్నాడు. ఇక తాజాగా రవి బాబు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు .

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన తన కెరియర్ లో ఎందుకు స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు అనే విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా రవి బాబు మాట్లాడుతూ ... నేను ఇప్పటి వరకు నా కెరియర్ లో అనేక సినిమాలకు దర్శకత్వం వహించాను . కానీ నేను దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు కొత్త వాళ్లతో లేదా చిన్న హీరోల తోనే చేశాను . స్టార్ హీరోలతో ఇప్పటి వరకు సినిమా చేయలేదు. నేను స్టార్ హీరోలతో సినిమా చేయకూడదు అని ఎప్పుడూ అనుకోలేదు . కాకపోతే అలా స్టార్ హీరోలతో ఎప్పుడు నాకు సినిమా సెట్ కాలేదు.

నేను ఎప్పుడూ కూడా కథ రాసుకున్నాక అందులోని పాత్రకు ఎవరు అయితే బాగుంటుంది అనే దాని పైనే దృష్టి పెడతాను . కానీ ఒక హీరోను అనుకొని , అతనిపై కథను రాయను. అందుకే నేను రాసుకున్న కథలలో ఎక్కువ శాతం కొత్త వాళ్లు , చిన్న హీరోలు ఉంటారు అని రవి బాబు తాజాగా చెప్పుకొచ్చాడు . ఇకపోతే ప్రస్తుతం ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడం కంటే కూడా సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఈయన అనేక సినిమాలలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rb

సంబంధిత వార్తలు: