బాపట్ల : వైసీపీ ఎంపీ అభ్యర్థిపై దాడి..ద్వంసమైన కారు..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్‌ జోరు గా సాగుతుంది.ఇప్పటికే సామాన్యుల తో సహా పలువురు సినీ ప్రముఖులు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈరోజు ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మరియు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు, అభ్యర్థులు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.నేడు పోలింగ్ సందర్భం గా రాష్ట్రం లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల మరియు ఎలక్షన్ కమిషన్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు..అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. 

టీడీపీ కి చెందిన నరసరావు పేట లోక్‌సభ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కారును వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు అలాగే వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై టీడీపీ నాయకులు దాడి చేసారు..తాజాగా వైసీపీ బాపట్ల లోక్‌సభ అభ్యర్థి అయిన ఎంపీ నందిగం సురేష్ కారుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.అయితే దాడి సమయం లో నందిగం సురేష్ కారు లో లేకపోవడం తో ప్రాణాపాయం తప్పింది. అయితే ఆ కారులో వైసీపీ కి చెందిన కొందరు ఏజెంట్లు  ఉన్నారు. వారికీ గాయాలైనట్లు సమాచారం..ఆ కారు ను పూర్తిగా ధ్వంసం చేసారు. టీడీపీ కార్యకర్తలు కారును ధ్వంసం చేస్తూ వైసీపీ నేత నందిగం సురేష్ ను  దుర్భాషలాడారు.ఇలా రాష్ట్రం లో పోలింగ్ జరిగే సమయం లో టీడీపీ నేతలు ఇలాంటి చెదురు ముదురు ఘటనలు చేసి ప్రజలను ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు రానికుండా చేస్తున్నారు. అయితే దాడి చేసిన వారిపై విచారణ జరిపిస్తామని ఎన్నికలధికారి తెలిపారు..దాడికి పాల్పడ్డ వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: