ఏపీ:పారిశ్రామ‌క‌, ఐటీ ప‌రిస్తితి ఏంటి?

Divya
2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎక్కువగా సంక్షేమ పథకాలకే మక్కువ చూపారని పారిశ్రామికంగా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాలేదనే వాదనలు అటు ప్రతిపక్ష పార్టీల సైతం తెలియజేస్తున్నాయి.. ముఖ్యంగా నిరుద్యోగులు సైతం ఎక్కువగా ఉన్నారని తెలుపుతున్నారు..తమ హయాంలో ఎక్కువగా అభివృద్ధి జరిగిందని పలు రకాల కంపెనీలు కూడా ఆంధ్రకు తీసుకువచ్చామంటూ అటు ప్రతిపక్ష నేతలు కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజున ఎన్నికల సమయం కావడం చేత ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక ఐటి పరిస్థితి ఎలా ఉంది అనే కోణంలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నేరుగా పెట్టుబడులు పెట్టిన సంస్థలు వచ్చే ఏడాది నుంచె పలు రకాల కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నారట.. అయితే వాస్తవానికి ఇవి గడిచిన రెండేళ్ల క్రితం నుంచి రావాల్సి ఉండగా మధ్యలో రెండేళ్లు కరోనాతో ఇబ్బందులు పడడం వల్ల ఇవి కాస్త ఆలస్యం అయ్యేలా తప్పడం లేదట.. అయినప్పటికీ కూడా ఇలాంటి వాటన్నిటిని జయించి మరి పలు రకాల షిప్ పోర్టులు, వంటనూనెలు, ఆక్వా శుద్ధి ప్లాంట్లు, బల్క్ డ్రగ్ పార్క్ ఇలా అనేక పరిశ్రమలు సైతం ఏర్పాటు చేస్తున్నాయి.. ఇప్పటికీ ఎన్నో ప్రాజెక్టుల సైతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగానే అడుగులు వేసింది వైసిపి పార్టీ.. అయితే మధ్యలో కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్లు వృధా కావడం ఇవి చేయడానికి అదనంగా మరో రెండు సంవత్సరాలు సమయం పడుతుంది. అందుకే కొత్త పరిశ్రమలు అన్నీ కూడా వచ్చే ఏడాదిలోపు ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు తీరంలోని పరిశ్రమల ఏర్పాటు పైన కూడా సీఎం జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.. వీటితో పాటు పలు రకాల ఐటి కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి సైతం సిద్ధమయ్యాయి.. మరి ఈసారి అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా వీటి గురించి సీఎం జగన్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: