ఏపీ: జనసేనలో వారికి దక్కిన అదృష్టం చూస్తే ఎవరైనా కుళ్ళుకోవాల్సిందే...??

Suma Kallamadi
2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ఈసారి ఎవరూ ఊహించని విధంగా ఫలితం వెళ్లడయ్యింది. జగన్ ఈసారి ఎన్నికల ప్రచారంలో వై నాట్ 175 అనే నినాదంతో హోరెత్తించారు. చాలా మంచి సంక్షేమ పథకాలు అమలు చేశామని అలాంటప్పుడు తమకు 175 ఎందుకు రావు అన్నట్లు ఆయన అందరితో చెప్పుకొచ్చారు కానీ చివరికి 11 సీట్లలో మాత్రమే వారిని ప్రజలు గెలిపించారు. పోయినసారి 151 సీట్లు రాగా ఇప్పుడు 5 ఎగిరిపోయింది, ఓన్లీ 11 సీట్లకే వైసీపీ పరిమితం అయింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్లు గెలుచుకుంటామని చెప్పుకుంటూ వచ్చారు ఆయన చెప్పినట్లే 100% సక్సెస్ సాధించగలిగారు.
21 చోట్ల పోటీ చేస్తే అన్నింటా కూడా గెలిచారు. రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తే అక్కడ కూడా వారికి 100% సక్సెస్ లభించింది. జనసేన తరపున పోటీ చేసిన వారందరూ సాధారణ కార్యకర్తలు. పెద్దగా బ్యాక్‌గ్రౌండ్, రాజకీయ అనుభవం లేని వారు. వాళ్లు ఒక్కసారిగా భారీ మెజార్టీలతో ఎమ్మెల్యేలుగా గెలిచారు. జనసేన తరపున వారు నిలబడటమే వారికి దక్కిన అతిపెద్ద అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు జనసేన తరఫున పోటీ చేసి అందరూ ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారికి అదృష్టం పడిశం పట్టినట్లు పట్టింది.
 ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్లు ఈసారి కూడా పోటీ చేశారు. వారందరూ కూడా చివరికి పవన్ కళ్యాణ్ పుణ్యమా అని అనుకున్నది సాధించగలిగారు. ఈ గెలుపు తర్వాత వాళ్లు పబ్లిక్ తో మమేకం కావచ్చు ఎమ్మెల్యే హోదాలను ఆస్వాదించవచ్చు. చేయాలనుకున్న ఎన్నో పనులను చేసి చూపించవచ్చు. భారీ మెజారిటీతో గెలిచారు కాబట్టి రాజకీయాల్లో వారికి మంచి అవకాశాలు ఉంటాయి. నాదెండ్ల మనోహర్ ఆల్రెడీ బాగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తప్ప మిగతా వారందరూ కూడా కొత్తవారే. అయితే వాళ్లు తాజా విజయంతో రాజకీయాల్లో తగినంత గుర్తింపు తెచ్చుకోగలుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: