టీడీపీ నుండి వైసిపికి వచ్చి.. అతనే జగన్ ఓటమికి కారణమయ్యాడా?

praveen
ప్రస్తుతం ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. అధికారంలో ఉన్న వైసిపి పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంత దారుణమైన ఓటమికి గల కారణాలు ఏంటి అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఆ తర్వాత ఎలక్షన్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడంఅందరిని అవాక్కయ్యేలా చేసింది.

 ఓటమి సరే కానీ ఇంత దారుణమైన ఓటమి ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. అసలు జగన్ పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అనే విషయంపై ఎంతో మంది విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే జగన్ ఓటమికి కారణం ఇదే అంటూ ఎన్నో విషయాలు తెర మీదకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి మరో కారణం కూడా ఉంది అంటూ ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒక వ్యక్తి కారణంగానే వైసీపీ పార్టీ ఓడిపోయింది అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎటువైపు ఉంటే ఆ పార్టీకి ఓటమి తప్పదు అని పాత సెంటిమెంట్లు చెబుతున్నాయని అందరూ అనుకుంటున్నారు.

 ఆయన ఎవరో కాదు కాకినాడ జిల్లాకు చెందిన చలమలశెట్టి సునీల్. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతూనే ఉంటుందట. 2009 నుంచి ఇదే తంతు జరుగుతుందని తెలుస్తుంది. చలమలశెట్టి సునీల్ 2009లో ప్రజారాజ్యం పార్టీకి తరపున కాకినాడ ఎంపీగా పోటీ చేశారు. ఇక ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ ఎంత దారుణంగా ఓడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆ తర్వాత 2014లో వైసీపీ తరఫున పోటీ చేస్తే.. ఇక ఫ్యాన్ పార్టీకి ఓటమి తప్పలేదు. ఇక 2019లో టిడిపి తరఫున పోటీ చేయగా.. సైకిల్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇక ఇప్పుడు 2024 లో వైసీపీ తరఫున పోటీ చేయగా ఆయన ఓడిపోవడమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహించిన వైసిపి కూడా అధికారం కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: