వరల్డ్ కప్ లో పాక్ ను దెబ్బ కొట్టింది.. మనోళ్లే తెలుసా?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా యూఎస్ వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ పైనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అద్భుతంగా సాగుతున్న ఈ ప్రపంచకప్ టోర్నీలో ఎన్నో మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా ప్రపంచకప్ ని ఫాలో అవుతున్న ప్రేక్షకులు అందరూ కూడా ఇప్పుడు ఒకే విషయం గురించి చర్చించుకుంటున్నారు. అదే ఇటీవలే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఘోర ఓటమి గురించి. సాధారణంగా వరల్డ్ కప్ అన్న తర్వాత ఏ జట్టుకైనా గెలుపు ఓటములు సహజం.

 పాకిస్తాన్ కూడా ఇలాగే ఓడిపోయింది అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు టైటిల్ రేసులో ఉంటుందో పోతుందో కూడా తెలియని పసికూన యూఎస్ఏ చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసింది. ఏకంగా పాకిస్తాన్ తమ ముందు ఉంచిన టార్గెట్ ను ఎంతో అలవోకగా చేదించే దిశగా దూసుకు వెళ్లిన యూఎస్ఏ జట్టు ఇక మ్యాచ్ ను టై గా ముగించింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. సూపర్ ఓవర్ లో కూడా సత్తా చాటిన యుఎస్ఏ పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించేసింది. పాకిస్తాన్ లాంటి అత్యుత్తమ టీం అటు యుఎస్ఏ చేతిలో ఓడిపోవడం ఏమిటి అని అందరూ చర్చించుకుంటున్నారు.

 అయితే ఇలా టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో యూఎస్ఏ గెలుపొందడం వెనక ఆ జట్టులోని భారత సంతతి ఆటగాళ్లే కీలక పాత్ర పోషించారు అన్నది తెలుస్తోంది. కెప్టెన్ మోనాక్ పటేల్ బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ తో రాణించగా బౌలింగ్లో సౌరబ్ నేత్ర వల్కర్ రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఇక సూపర్ ఓవర్ లోను నేత్ర వల్కర్ దాటికి పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు నిలవలేకపోయారు. ముంబైలో పుట్టిన సౌరబ్ గతంలో రంజి ట్రోఫీలో 2013 - 14 లో ఆడాడు. ఇక అండర్ 19 టీమ్ ఇండియా జట్టుకి కూడా ప్రాతినిధ్యం వహించాడు. కానీ అతని ఫ్యామిలీ యూఎస్ఏ లో సెటిల్ కావడంతో ఇక అక్కడ ఆ దేశం తరఫున క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: