మంచు లక్ష్మీ: తండ్రి కోసం ప్రేమించిన వాడికి దూరం.. !

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో.. బడా ఫ్యామిలీకి చెందిన సినీ వారసురాలు మంచు లక్ష్మి సినీ ఇండస్ట్రీలోకి విలన్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటించింది. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇదిలా ఉండగా మంచు లక్ష్మి కెరియర్ గురించి అందరికీ తెలుసు.. కానీ ఆమె వ్యక్తిగత జీవితం కొంతమందికి మాత్రమే తెలుసునని చెప్పడంలో సందేహం లేదు. ఈమె పర్సనల్ లైఫ్ చాలా వరకు సీక్రెట్ గానే ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈమె మొదటి భర్తకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
మంచు లక్ష్మి..  ఇండస్ట్రీలో ఉన్న అందరికంటే ఈమె కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటుంది. లక్ష్మీ ఒక్కటే కాదు మంచు ఫ్యామిలీ మొత్తం డిఫరెంట్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పటికే వారిపై చాలా ట్రోల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మంచు లక్ష్మి చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజీ స్నేహితుడైన ఒక వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయి మరీ ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని అతడికి భార్యగా మారిపోయింది. అయితే తన ప్రేమను మంచు మోహన్ బాబు కాదనడంతో మంచు లక్ష్మికి కోపం వచ్చే బయటకు వెళ్లి పెళ్లి చేసుకుందని సమాచారం . ముఖ్యంగా మోహన్ బాబు ఊర్లో లేని సమయంలో ఎవరికి చెప్పకుండా ఆర్య సమాజంలో తాను ప్రేమించిన శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
విషయం తెలుసుకున్న మోహన్ బాబు కూతురుని ఏమీ అనకుండా అతడిని చాలా ఇబ్బంది పడేలా చేశారట. అతడి కుటుంబ సభ్యులను, బంధువుల్ని కూడా రౌడీలను పెట్టి బెదిరించారని అప్పటి వాళ్ళు చెప్పుకునేవారు .ఇక బెదిరింపులు , భరించలేని మంచు లక్ష్మి తండ్రితో ఏదో ఒకటి తేల్చుకుందామని ఇంటికి వెళ్లిందట.. కానీ మంచు మోహన్ బాబు మాటలకు ఏ మనసు మార్చుకుందో తెలియదు కానీ అతడికి విడాకులు ఇచ్చేసి తండ్రి చూసిన ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక్కడ యాదృచ్ఛికమేమిటంటే మంచు లక్ష్మి రెండవసారి వివాహం చేసుకున్న వ్యక్తి పేరు కూడా శ్రీనివాస్ కావడం గమనార్హం. ఇక వీరికి ఒక అమ్మాయి కూడా జన్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: