ఇంకా జగన్‌ వైపే మోదీ.. ఇదిగో తిరుగులేని సాక్ష్యం?

Chakravarthi Kalyan
ప్రధాని మోదీ దూకుడు పెంచారు. ఏపీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలు సభల్లో పాల్గొన్న ప్రధాని ఏపీ ప్రభుత్వంపై జగన్ పేరెత్తకుండా విమర్శలు చేశారు. గతంలో కూటమి ప్రచారంలోను మోదీ జగన్ పై కాకుండా మంత్రులు, ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడేమో తాజాగా ఓ అడుగు ముందుకేసి టీడీపీ, జనసేన నాయకులు కోరుకున్నట్లుగా వైసీపీ ప్రభుత్వాన్ని అయితే విమర్శించారు కానీ.. జగన్ ప్రస్తావన తీసుకురావడం లేదు.

ఏపీలోను డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని మోదీ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం కాకుండా మాఫియా కోసం పనిచేస్తుందని విమర్శించారు. అన్నమయ్య జిల్లా పీలేరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ.. ఏపీలో ఎన్డీయే కూటమి, డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనేక ఖనిజాలు, దేవాలయాలు కలిగిన నేల రాయలసీమని.. ఈ ప్రాంతంలో చైతన్యవతంమైన యువత ఉందన్నారు.

ఇక్కడ ఓ ఆసక్తికర అంశం ఏంటంటే.. జగన్ పేరు లేకుండా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రధాని మోదీ.. తన ఎన్నికల ప్రసంగంలో టీడీపీ పేరు మాత్రం ప్రస్తావించడం లేదు. అలా అని భాగస్వామి జనసేనను తలచుకోవడం లేదు. ఎంత వరకు ఎన్డీయే, బీజేపీ గురించి మాత్రమే చెబుతున్నారు. అటు టీడీపీ, ఇటు జగన్ ఈ రెండు పేర్లు లేకుండా ప్రధాని మోదీ చాలా వ్యూహాత్మకంగా ఏపీలో పర్యటిస్తున్నారు.

ప్రధాని మోదీ మాటల మాంత్రికుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ప్రధాని ప్రసంగం అంటేనే తీవ్రమైన కసరత్తులు జరుగుతాయి. ఆయన నోటెంట ఏ చిన్న మాట వచ్చిన దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. అయితే మోదీ టీడీపీ ప్రస్తావన తీసుకురాకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందని విశ్లేషణలు మొదలయ్యాయి. ఎందుకంటే ఏపీలోని రెండు పార్టీలు టీడీపీ, వైసీపీ తమకు అనుకూలంగా వ్యవహరించేవే. ఈ సమయంలో ఇద్దరితో వైరం పెంచుకోవాలని మోదీ భావించడం లేదు.  ఒకవేళ ఎన్నికల తర్వాత ఆయా పార్టీలతో అవసరం వస్తే ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని ప్రచారం సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: