ఏపీ: వైకాపాకు ఝలక్కిచ్చిన బావమరిది?

Suma Kallamadi
ఆంధ్రా ఎన్నికలకు దగ్గర పడుతుండడంతో సర్వత్రా చాలా ఆసక్తికరమైన విషయాలు చేటు చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే వైకాపా అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి బావ మరిది, ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పి. మునిరెడ్డి అలియాస్ బంగారు రెడ్డి (వైఎస్సార్ జిల్లా) పార్టీకి ఝలక్కిచ్చారు. అవును, శివ ప్రసాద్ రెడ్డికి ఎన్నికల్లో అక్రమంగా తోడ్పడటానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున నామినేషన్ వేసి రంగంలో నిలిచారు. ప్రచారంలో ఎన్నికల ఖర్చు, పోలింగ్ రోజు అభ్యర్థిగా నియోజక వర్గంలో తిరగడం, తన తరపున పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను పెట్టుకోవడం వంటి ఎత్తుగడల్లో భాగంగా ఈ పథకం వేసినట్టు గుట్టు రట్టయింది.
ఈ క్రమంలోనే తన పేరు, ఫొటో సరిగ్గా కనిపిస్తే తనకు ఓట్లు పడి బావకు అన్యాయం జరుగుతుందని ప్లాన్ పక్కాగా షురూ చేసినట్టు బయటకు పొక్కింది. అందుకే ఆ అవకాశం లేకుండా తల నీలాలు తీసేసినప్పటి ఫొటోను నామినేషన్ కు సమర్పించి.. పేరునూ కాస్త మార్చి పి. ముని రెడ్డి బంగారుగా పేర్కోవడం జరిగింది. కాగా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం జారీ చేయగా అందులో వరుస సంఖ్య పదిలో ఆయన పేరు ఉండడం కొసమెరుపు. కాగా ఈ చర్య అధికార పార్టీ వైస్సార్సీపీకి కోపం తెప్పించినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఈ విషయమై జగన్ రంగంలోకి దిగి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి బావ మరిదిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు గుసగుసలు వినబడుతున్నాయి.
ఏది ఏమైనా ఎన్నికల వేళ వైకాపాకు వరుసగా చురకలు మీద చురకలు తగులుతున్నట్టు గోచరిస్తోంది. మొన్న రిలీజైన మేనిఫెస్టో అయితే ప్రజలను ప్రత్యేకంగా ఉత్తేజ పరిచిన దాఖలాలు కనబడడం లేదని సర్వేలే చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో సొంత పార్టీ నేతలే జగన్ కి కొత్త తలనొప్పులు తెప్పిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: