జగన్ ముందు రేర్ రికార్డ్.. సాధ్యమయ్యిద్దా?

Purushottham Vinay
మన దేశంలో తండ్రీ కొడుకులు సీఎంలు కావడం అత్యంత అరుదు. మహారాష్ట్రలో శంకర్ రావు చవాన్- అశోక్ చవాన్, జమ్ముకశ్మీర్ లో షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ఒడిసాలో బిజూ పట్నాయక్- నవీన్ పట్నాయక్, యూపీలో ములాయం సింగ్ యాదవ్-అఖిలేశ్ యాదవ్, కర్ణాటకలో దేవెగౌడ-కుమారస్వామి ఇలాంటి రికార్డును అందుకోగా..ఆంధ్రప్రదేశ్ సీఎంగా  2019లో వీరి జాబితాలో చేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా తమిళనాడులో కరుణానిధి-ఎంకే స్టాలిన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.ఇలా పలు రాష్ట్రాల్లో తండ్రీ కొడుకులు సీఎంలు అయిన ఉదంతాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తండ్రిలాగానే సీఎం అయిన ఘనత మాత్రం ఒక్క వైఎస్ జగన్ కే సొంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలువురు సీఎంల కుమారులు చురుగ్గా వ్యవహరించినా కానీ వారెవరూ తదనంతరం సీఎంలు కాలేదు. అయితే, తండ్రి అకాల మరణం తరువాత రాష్ట్ర విభజనకు ముందే సొంత పార్టీని పెట్టుకున్న జగన్.. 2014లో విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ ను కొద్దిలో కోల్పోయారు. 2019లో మాత్రం భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.జమ్మూ, కాశ్మీర్ విషయానికి వస్తే..షేక్ అబ్దుల్లా మరణం తర్వాత ఆయన కుమారుడు ఫరూక్ వెంటనే సీఎం అయ్యారు.


 అయితే, ఫరూక్ కుమారుడు ఒమర్ అబ్దుల్లా కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరి మూడు తరాల వారూ ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే, ఫరూక్ పలుసార్లు సీఎం అయినా షేక్ అబ్దుల్లా తర్వాత వరుసగా రెండు సార్లు ఆ పీఠంపైన కూర్చోలేకపోయారు. మహారాష్ట్రలో చవాన్ లు, ఒడిశాలో పట్నాయక్ లు, యూపీలో ములాయం-అఖిలేశ్, కర్ణాటకలో దేవెగౌడ-కుమారస్వామి ఇలా ఎవరూ వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రులు కాలేదు. కానీ, ఏపీలో జగన్ ముందు మాత్రం ఈ రేర్ రికార్డు నిలిచింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో బంపర్ మెజారిటీతో వైఎస్ గెలిచిన వచ్చిన సంగతి తెలిసిందే. 2009లో కూడా ఆయన ఒంటిచేత్తో పార్టీని గెలిపించారు. వరుసగా రెండోసారి సీఎంగా ఆయన ప్రమాణం చేశారు. అయితే, జగన్ ఆ వెంటనే విభజిత ఏపీలో (2014) ఎన్నికలను ఎదుర్కొన్నా కూడా అధికారంలోకి రాలేకపోయారు. 2019లో గెలిచిన ఆయన 2024 ఎన్నికల్లో కూడా పవర్ చేజిక్కించుకుంటే వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆయన తండ్రి రికార్డును సమం చేస్తారు. అయితే ఎవరికీ సాధ్యం కాని ఈ అరుదైన ఘనతనూ అందుకుంటారు. మరి ఇలా జరుగుతుందా? లేదా? తెలియాలంటే జూన్ 4 దాకా ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: