కూటమి మేనిఫెస్టో : కొన్ని అక్కడి నుండి... కొన్ని ఇక్కడి నుండి..?

Pulgam Srinivas
నిన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం , జనసేన , బీజేపీ పార్టీల మేనిఫెస్టో విడుదల అయింది. ఇక అంతకుముందే వైసీపీ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశాడు. ఇక అందులో గొప్ప ఆశించిన స్థాయి పథకాలు ఏవి కొత్తవి లేకపోవడం , అలాగే ఉన్న వాటిలో కూడా భారీ మార్పులు లేకపోవడంతో వైసీపీ మేనిఫెస్టో పై భారీ ఆశలు పెట్టుకున్న వారు కాస్త నిరాశ చెందారు.

కాకపోతే వైసీపీపార్టీ శ్రేణులు , నాయకులు , కార్యకర్తలు మాత్రం ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇవ్వడం అనవసరం , అందుకే చెప్పినవన్నీ చేయాలనే ఉద్దేశంతోనే అలా మేనిఫెస్టోలో తయారు చేసాం అని చెప్పుకొచ్చారు. దానితో ప్రజలు కూడా అవును కదా... అనవసరపు హామీలు ఎందుకు ఇవ్వడం.. చేసేవే చెప్పాలి.. ఇదే కరెక్ట్ అనే ఉద్దేశానికి వచ్చారు. ఇక దానితో కూటమి మేనిఫెస్టో పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక నిన్న అది కూడా వచ్చింది. ఇక కూటమి మేనిఫెస్టో కూడా ప్రజలు పెద్ద స్థాయిలో ఆనందించేలా లేదు. వీరు అక్కడి నుండి , ఇక్కడి నుండి పోగు చేసిన హామీలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు.

ఉచిత కరెంటు ఇస్తాము అని కూటమి మేనిఫెస్టోలో ఉంది. ఇది ఇప్పటికే తెలంగాణలో అమలు అవుతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు , మహిళలకు నెల నెల డబ్బు , నిరుద్యోగ భృతి లాంటివి కొన్ని ఉన్నాయి. ఇవి చాలా రాష్ట్రాలలో ఇప్పటికే అమలులో ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా గతంలో తెలుగు దేశం హయాంలో 2000 ఉన్న పెన్షన్ ను జగన్ 3000 చేస్తే , దానిని నాలుగు వేలు చేస్తాను అని కూటమి హామీ ఇచ్చింది. ఇక రైతులకు 20,000 రైతు భరోసా ఇస్తాను అని ప్రకటించారు. ఇలా కూటమి మేనిఫెస్టో కొన్ని పక్క రాష్ట్రాల నుండి , మరికొన్ని వైసీపీ నుండి కాపీ కొట్టినవి అని విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: