విశాఖ విన్న‌ర్ : టీడీపీకి క‌ష్టంగా... బొత్స ఝాన్సీకి పాజిటివ్‌గా మారుతోందా..?

Divya
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది విశాఖ రాజ‌కీయం మామూలుగా వేడెక్క‌డం లేదు. కీలక‌మైన విశాఖ పార్ల‌మెంటు పోరులో సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ బొత్స ఝాన్సీ గెలుస్తుందా ?  టీడీపీ నుంచి జూనియ‌ర్ శ్రీ భ‌ర‌త్ గెలుస్తారా ? అన్న చ‌ర్చ స‌హ‌జంగానే న‌డుస్తోంది. వాస్త‌వానికి మూడు నెల‌ల ముందే ఇక్క‌డ ఝాన్సీని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌క ముందే భ‌ర‌త్‌కు వార్ వ‌న్‌సైడ్ అనుకున్నారు. క‌ట్ చేస్తే ఇప్పుడు ఝాన్సీ గెలుపు బాట‌లో వెళుతున్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణ‌లు, అనూహ్య ప‌రిణామాలు ఇక్క‌డ ఝాన్సీకి అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డేలా చేస్తున్నాయి. గ‌తంలో బొబ్బిలి ( ర‌ద్ద‌య్యింది), ఆ త‌ర్వాత విజ‌య‌న‌గ‌రం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఝాన్సీ విశాఖ స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంటులో చేసిన ప్ర‌సంగాలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. త‌న‌కు సంబంధం లేన‌ప్పుడే ఆమె విశాఖ అభివృద్ధి గురించి పార్ల‌మెంటులో మాట్లాడారు.. ఇప్పుడు ఎంపీగా అవ‌కాశం ఇస్తే మరింత‌గా పార్ల‌మెంటులో విశాఖ స‌మ‌స్య‌లు, అభివృద్ధి గురించి మాట్లాడాత‌ర‌న్న మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది.

పైగా విశాఖ ఝాన్సీ పుట్టిల్లు. ఇవ‌న్నీ ఇలా ఉంటే నెక్ట్స్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే విశాఖ రాజ‌ధానిగా.. విశాఖ కేంద్రంగానే త‌న ప‌రిపాల‌న ఉంటుంద‌ని జ‌గ‌న్ చెప్ప‌క‌నే చెప్పేశారు. ఈ ఎఫెక్ట్ విశాఖ వాసుల‌పై గ‌ట్టిగా ప‌డింది. విశాఖ‌పై గ్లోబ‌ల్ మార్కెట్ దృష్టి ప‌డ‌డంతో పాటు పెట్టుబ‌డులు వాటంత‌ట అవే వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కాలు ఇక్క‌డ క‌లుగుతున్నాయి. విశాఖ‌లో ఇప్పుడు వైసీపీ ఎంత బ‌లంగా ఉందంటే.. గ‌త ఎన్నిక‌ల్లో న‌గ‌రంలో నాలుగు దిక్కులా ఉన్న నాలుగు సీట్ల‌లో టీడీపీయే గెలిచింది.

ఇప్పుడు అవే నాలుగు సీట్లలో టీడీపీ డ్యామ్ షూర్‌గా గెలిచే సీటు ఏది అంటే ఆ పార్టీ వాళ్లే అన్నీ టైటే అంటున్నారే త‌ప్పా ఏ ఒక్క‌టి గెలుస్తాం అని గ్యారెంటీగా చెప్ప‌లేక‌పోతున్నారు. ఝాన్సీకి మ‌రో సానుకూల అంశం ఏంటంటే విశాఖ పార్ల‌మెంటు ప‌రిధిలో బ‌లంగా ఉన్న సామాజిక వ‌ర్గం వారికి 30 ఏళ్ల త‌ర్వాత ఝాన్సీ రూపంలో అవ‌కాశం వ‌చ్చింది. వాళ్లు ఈ సారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ వ‌దులు కోకూడ‌ద‌ని.. ఆమెను గెలిపించుకోవాల‌ని డిసైడై పోతున్నారు. ఈ స‌మీక‌ర‌ణం ఝాన్సీకి చాలా అంటే చాలా ఫ్ల‌స్ అవుతోంది.

దీనికి తోడు చిన్న‌ప్ప‌టి నుంచి ఆమెకు విశాఖ‌ప‌ట్నంపై స‌మ‌గ్ర అవ‌గాహ‌న ఉండ‌డంతో పార్ల‌మెంట్లో ప్ర‌స్తావిస్తార‌న్నది కూడా బాగా జ‌నాల్లోకి చొచ్చుకుపోయింది. గ‌తంలో ఎంపీగా ఉన్న‌ప్పుడే ఉత్త‌రాంధ్ర‌లో రైల్వే స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంటు వేదిక‌గా పోరాటం చేసి కొన్నింటిని ప‌రిష్క‌రించారు. ఇక ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటు త‌నం మీద కూడా ఆమె ఎన్నోసార్లు గ‌ళ‌మెత్తారు. అటు టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న శ్రీ భ‌ర‌త్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాక ఒక్క‌టంటే ఒక్క ప్ర‌జా స‌మ‌స్య మీద స్పందించిన దాఖ‌లాలు లేవు.

కేవ‌లం త‌న విద్య‌, ఇత‌ర వ్యాపారాల‌ను విస్త‌రించుకోవ‌డం మీద దృష్టి పెట్టుకోవ‌డం త‌ప్పా.. త‌న వ్యాపారాలు, ఇత‌ర విష‌యాల‌కు అనుమ‌తులు తెచ్చుకోవ‌డం మీద ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న వంతుగా ఇది చేశాడు అని చెప్పుకోవ‌డానికి ఒక్క‌టి కూడా లేదు. ఏదేమైనా ఖ‌చ్చితంగా టీడీపీ గెలుస్తుంద‌న్న టాక్ నుంచి టైట్‌.. క‌ష్టం... ఇలా విశాఖ పార్ల‌మెంటు గెలుపు విష‌యంలో లెక్క‌లు రోజు రోజుకు తారుమార్ త‌క్కెడ మార్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: