అంతా బావుందనుకుంటే.. ఈ గాజు గ్లాస్‌ గోలేంట్రా బాబూ?

Chakravarthi Kalyan
గాజు గ్లాస్ కాదు కానీ.. ఇప్పుడు అది కాస్తా పగిలి కూటమికే గుచ్చుకుంది.  అది కామన్ సింబల్ గా జనసేనకు లేదు.  ఫ్రీ సింబల్ గా  దానిని ఈసీ ప్రకటించింది. దీంతో దాదాపు 30-40 నియోజకవర్గాల్లోని స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తును కేటాయించారు. ఇది జనసేన అధికారికంగా పోటీ చేస్తున్న నియోజకవర్గాల కంటే రెట్టింపు. దీంతో టీడీపీ కూటమిలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి.

మొత్తం మీద ఏపీలో దాదాపు 40 సీట్లలో గాజు గ్లాస్ గలగల సౌండ్లు చేస్తున్నాయి. ఇది టీడీపీ కూటమిని విపరీతంగా కలవరపెడుతోంది. గాజు గ్లాస్ అంటేనే పవన్ కల్యాణ్ జనసేనదే అన్నది అందరికీ తెలుసు. నిన్నటి దాకా సీటు తమకే వస్తుందని ఆశావహులు గల్లీల్లో తిరిగి తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ గుర్తు ప్రత్యర్థులకు వెళ్లింది.

ఎంత కాదనుకున్నా మరెంత వీలు లేదనుకున్న గాజు గ్లాస్ గుర్తుకు కనీసం ప్రతి నియోజకవర్గంలో వేయి నుంచి రెండు వేల దాకా ఓట్లు పడతాయి. అసలే వైసీపీ, టీడీపీ కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. చాలా చోట్ల ఈసారి వందల ఓట్లు కూడా విజేతను డిసైడ్ చేస్తారని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాంటి వాతావరణ ఉన్న నేపథ్యంలో ఈ 40 అసెంబ్లీ సీట్లు గాజు గ్లాస్ కొంప ముంచేస్తుంది అన్న భయాలు కూటమిలో వెంటాడుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. మంగళగిరిలో సైతం నవతరం పార్టీ అభ్యర్థిగి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఇంకా పలు నియోజకవర్గాలు చూసుకుంటే.. కించరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు, సెంట్రల్, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం, మచిలీపట్నం, ఆముదాల వలస, పాలకొల్లు, తణుకు, మండపేట, రాజమహేంద్రవరం అర్బన్ స్థానాల్లో స్వతంత్రులకు ఈ గుర్తు కేటాయించారు. దీనిపై కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: