టీడీపీ: ఆ ఒక్కటి ప్రజలు నమ్మితే గెలుపే.!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రజలలో మెప్పు పొందడానికి పలు పార్టీల సైతం మేనిఫెస్టోని ఇటీవలె విడుదల చేశారు. గడిచిన కొద్ది రోజుల క్రితం వైసీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల కాగా.. నిన్నటి రోజున టిడిపి, జనసేన ,బిజెపి ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు.. అయితే కూటమిలో భాగంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో కేవలం ఒక్క పథకం క్లిక్ అయితే చాలు కచ్చితంగా గెలుస్తుందనే స్పష్టత ఇప్పుడు వినిపిస్తోంది. ఆ పథకం ఏమిటంటే రెండు రాష్ట్రాలలో ఇప్పటికే అధికారంలోకి తెచ్చిన పథకం అన్నట్లుగా సమాచారం.

అసలు విషయంలోకి వెళ్తే కర్ణాటకలో బిజెపి అధికారంలో ఉండేది... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఐదు ఉచిత హామీలను సైతం ప్రకటించింది.అందులో ముఖ్యంగా ఆర్టిసి బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం అన్నట్లుగా తెలిపారు.. ఏరోజైతే మహిళలకు ఉచిత ప్రయాణమని కాంగ్రెస్ ప్రకటించిందో ఆరోజు కర్ణాటకలో బిజెపికి చుక్కలు కనపడ్డాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ కాంగ్రెస్ సింబల్ గెలిచింది. అక్కడ ఈ పథకం బాగానే వర్క్ అవుట్ అయ్యింది. దీంతో ఇదే పథకాన్ని తీసుకువచ్చి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉపయోగించగా కెసిఆర్ ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో మహిళా ఓటర్లకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం బాగా సక్సెస్ అవడంతో ఇప్పుడు ఇదే పథకాన్ని కూటమిలో భాగంగా టిడిపి మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే ఈ పథకం మహిళా ఓటర్లను ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతోంది.ఒకవేళ ఈ పథకం వర్కౌట్ అయితే ఇప్పటివరకు రెండు రాష్ట్రాలలో గెలిచినట్టుగానే ఇక్కడ కూడా కూటమి అధికారంలోకి వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు కూడా ప్రతి నెల 1500 ఇస్తామంటూ టిడిపి కూటమిలో భాగంగా మేనిఫెస్టోని విడుదల చేశారు. అలాగే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చామని ప్రకటించడంతో ఈ మూడు పథకాలు కరెక్ట్ గా ప్రజలలోకి తీసుకువెళ్తే కచ్చితంగా టిడిపికి విజయం అందుకుంటుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: