చిరంజీవి: తమ్ముడు ప్రచారం.. కూటమికి లాభమేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ఉత్కంఠ రేపేలా కనిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు.. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ ని గెలిపించడానికి చాలా మంది సెలబ్రిటీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మెగా కుటుంబం కూడా పవన్ కళ్యాణ్ ను గెలిపించడానికి నాన్న తంటాలు పడుతోంది. ఇప్పుడు తాజాగా చిరంజీవి కూడా పిఠాపురంలో ప్రచారానికి భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే 5 వ తేదీ నుంచి చిరు ప్రచారంలో పాల్గొంటారని సమాచారం.

జనసేన నాయకులు పృథ్వి ఈ విషయాన్ని తెలియజేశారు.. అయితే ఈ ప్రకటనని ముందు తేలిగ్గా తీసుకున్నట్లు వైసిపి పార్టీ మాట్లాడిన ఎక్కడో ఒకచోట చిరంజీవి భయం పట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. పిఠాపురంలో జనసేన తప్పితే మరో జండా కనిపించడం లేదని అందరి దృష్టి కూడా పవన్ కళ్యాణ్ వైఫై పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనకి అనేక వర్గాల మద్దతు కూడా అక్కడ తెలుపుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఒకవేళ చిరంజీవి కూడా ప్రచారంలో వస్తారని సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో వైసిపి అభ్యర్థి వంగా గీతా కూడా కొత్త పల్లవి అందుకున్నట్లు సమాచారం.

చిరంజీవి ప్రచారానికి వస్తే తనకి ఆనందమే కానీ.. ఆయన నాకు అన్నలాంటి వారని ఆయన నా గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని కూడా తెలియజేస్తుంది.చిరు ప్రచారానికి వస్తే అది పిఠాపురం కే పరిమితం కాదు ఒకవేళ రాష్ట్రమంతా కూడా దీనిపైన ప్రభావం చూపుతుందని అటు కూటమిలో భాగంగా పలువురు నేతలు మాట్లాడుకుంటున్నారు. నిజానికి రాజకీయాలకు చిరంజీవి పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాల పైన దృష్టి పెట్టారు కానీ వైసీపీ నేతలు మాట్లాడిన మాటల వల్ల చిరంజీవి రెచ్చిపోయి మరి తన తమ్ముడిని గెలిపించడానికి పాట్లు పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి చిరంజీవి నిజంగానే ప్రచారానికి వస్తారో లేదో చూడాలి మరి. ఒకవేళ వచ్చిన ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: