షర్మిల: సీటు ఇచ్చిన పోటీ చేయనన్న మహిళ నేత.. షాకే..!

Divya
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఇటీవల పొలిటికల్ పై ఒక ట్విట్ చేశారు.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశం తనకు మాత్రం లేదని తాను విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నానని.. అయితే కొన్ని కారణాల చేత అధిష్టానం తమకు అవకాశం కల్పించలేదని.. తనని సంప్రదించకుండానే విజయవాడ తూర్పు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది.. అయితే తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన అసలు లేదని కేవలం పార్టీ కోసం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాత్రమే తాను కృషి చేస్తానంటూ కూడా తెలియజేస్తోంది. తాను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అధిష్టానం సహృదయంతో సహకరించాలని తెలియజేస్తోంది సుంకర పద్మజ. అయితే ఈమె ఇలా చేయడంతో షర్మిల కి గట్టి షాక్ తగిలినట్టుగా కనిపిస్తోంది.

అయితే గతంలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కూడా ఈమె పేరును గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆమె నిరాకరించడంతో.. ఇప్పుడు సుంకర పద్మజా ప్లేసులో విజయవాడ ఈస్ట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మరోక అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్నది.. 38 మంది అభ్యర్థుల పేరుతో సోమవారం రోజున ఒక జాబితాని కూడా విడుదల చేశారు. ఇందులో మళ్లీ పదిమంది అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ పేరు మార్చి మరో కొత్త నేతలకు అవకాశాన్ని కలిగించింది. దీంతో చాలా మంది నేతలలో నిరసనలు కూడా కనిపిస్తున్నాయి.

విజయవాడ పార్లమెంట్ టిడిపి పార్టీ నుంచి కేశినేని చిన్ని వైసీపీ తరఫున కేసినేని నాని కూడా పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వల్లూరు భార్గవ్ కూడా పోటీ చేయబోతున్నారు. విజయవాడ ఈస్ట్ నుంచి టిడిపి పార్టీ నుంచి గద్దె రామ్మోహన్.. వైసీపీ నుంచి దేవినేని అవినాష్ వంటి నేతలు పోటీ చేస్తున్నారు. మరి రేపటితో నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాబోతోంది. కాంగ్రెస్ పార్టీలో మరి ఎవరెవరు ఇంకా తప్పకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: