పవన్: అలాంటి ప్రకటన చేసే దమ్ముందా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు మాటలు యుద్ధంతో చాలా హీట్ ఎక్కుతున్నాయి. ఇటీవల కాపులను జగన్మోహన్ రెడ్డి మోసగించారంటూ జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీంతో పలువురు వైసిపి నేతలు కూడా ఫైర్ కావడం జరుగుతోంది. ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో టిడిపి పార్టీతో కలిసి హామీ ఇచ్చినా.. ఆ తర్వాత ఆ హామీని మరిచిపోయారంటూ పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవుతున్నారు. బిజెపి గవర్నమెంట్ ఆర్థికంగా వెనుకబడిన కులాలకు 10% రిజర్వేషన్ కింద ఈడబ్ల్యూఎస్ ఇవ్వగా అందులో ఐదు శాతం కాపులకు కేటాయిస్తామంటూ గత ఎన్నికలలో చంద్రబాబు డ్రామా ఆడారనీ వైసీపీ నేతలు తెలుపుతున్నారు.

తాజాగా ఇప్పుడు రాజనగరంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాపుల రిజర్వేషన్ పైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలన రాగానే కాపులకు ఎందుకు రిజర్వేషన్ రద్దయిందో అంటూ సీఎంని కాపు నాయకులే అడగాలంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. అలాగే ప్రతిదానికి తనను తిట్టడం మానేసి.  కాపులలో ఆర్థికంగా వెనుకబడిన వారందరికి ఐదు శాతం రిజర్వేషన్ ఎందుకు తీసేసావ్ అంటూ మీ సీఎంని అడగండి అంటూ వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నారు.
ఈ విషయం పైన వైసీపీ పార్టీలో గెలిచిన కాపు నేతలు కూడా సమాధానం తెలుపాలంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.ఇదంతా బాగానే ఉన్నా.. నిజానికి పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గం పైన అంత ప్రేమ ఉంటే రాబోయే ఎన్నికలలో ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తానంటూ ప్రకటించే దమ్ముందా అంటూ పలువురు అధికార పార్టీలు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నారు.. కేవలం పవన్ జగన్ ను వ్యతిరేకంగా చూపించడానికి ఇలా చేస్తున్నారే తప్ప తమ సొంత వారి మీద ఎలాంటి ప్రేమ లేదంటూ పలువురు నేతలు విమర్శిస్తున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కాపులు ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాలో ప్రచారం చేస్తూ .. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వలేను అంటూ కూడా తెలియజేశారు. ఈ విషయాన్ని మళ్లీ ఇప్పుడు అధికార పార్టీ నేతలు కూడా గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కు తమ కాపుల పైన ప్రేమ మాటలలో కాదని చేతలలో చూపించాలంటూ హితవు ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు. ముఖ్యంగా కూటమి మేనిఫెస్టోలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వగలమని హామీ ఇవ్వగలరా అంటూ పలువురు నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: