స‌మ‌రంలో సామాన్యులు.. ఫ‌స్ట్ టైం ప్ర‌యోగం చేసిన జ‌గ‌న్‌..?

RAMAKRISHNA S.S.
ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో సామాన్యులు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల్లో వీళ్లు పోటీ చేయ‌కూడ‌ద‌ని కానీ.. చేయొచ్చ‌నికానీ.. లేదు. రూపాయికి తికాణాలేని వారు కూడా.. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన సంద‌ర్భాలు.. ఏపీలో చాలానే ఉన్నాయి. 1978లో అయితే.. ప్ర‌జ‌ల నుంచి చందాలు సేక‌రించి.. డిపాజిట్లు క‌ట్టి మరీ పోటీ చేసిన స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా ఉన్నారు. వారిలో కొంద‌రు గెలిచిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.
అయితే.. ఇప్పుడు ఎన్నిక‌లు ఖ‌రీద‌య్యాయి. పోటీ చేసే అభ్య‌ర్థులు కోటీశ్వ‌రులుగా ఉన్నారు. దేశ‌వ్యాప్తం గా దాదాపు ఈ ప‌రిస్థితే ఉంది. అయితే.. ఇలాంటి స‌మ‌యంలోనూ వైసీపీ.. కొంద‌రు సామాన్యుల‌కు అవ‌కాశం ఇచ్చింది. ఇలాంటి వారు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్య‌ర్థులు.. కూడా సామాన్యులేనా? అంటే కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల‌పై పోటీ చేసే ప్ర‌ధాన పార్టీ అభ్య‌ర్థులు మిలియ‌నీర్లు.. పారిశ్రామిక వేత్త‌లుగా ఉండ‌డం గ‌మ‌నార్హం.
ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ వెస్ట్ నుంచి ఉత్త‌రాంధ్ర‌లోని అన‌కాప‌ల్లి వ‌ర‌కు కూడా.. చాలా మంది వైసీపీ నాయ‌కులు సామాన్యులే. ఇప్ప‌టికే వీరు స‌మ‌ర్పించిన ఎన్నిక‌ల అఫిడ‌విట్ల ప్ర‌కారం.. వారి స్థిర‌, చ‌రాస్తుల విలువ కేవ‌లం ల‌క్ష‌ల్లోనే ఉండ‌గా..వీరిపై పోటీ చేస్తున్న ప్ర‌త్య‌ర్థి కూట‌మి పార్టీల‌కు చెందిన నాయ‌కులు మాత్రం కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తి ఉండ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప్ర‌యోగానికి దిగారు.
సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. సుమారు 20 నుంచి25 నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్యంత సామా న్యుల‌కే వైసీపీ అధినేత టికెట్లు ప్ర‌క‌టించారు. వీరు ఎన్నిక‌ల ప్ర‌చార ఖ‌ర్చులైతే.. భ‌రించ‌గ‌ల‌రేమో కానీ.. ప్ర‌జ‌ల‌కు తాయిలాలు.. భారీ ఎత్తున ప్ర‌చారాలు మాత్రం నిర్వ‌హించే ప‌రిస్థితి అయితే లేదు. మ‌రి ఈ ప్ర‌యోగం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం పోలింగ్ తీరు మారాలని చెబుతున్న మేధావులు.. ఈ విధానాన్ని స్వాగ‌తిస్తున్నా.. సామాన్య ఓట‌ర్లు.. ఎలా స్పందిస్తార‌నేదిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: