జగన్: మూడో వ్యూహానికి సిద్ధం..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు వైసిపి టిడిపి పార్టీల మధ్య హోరాహోరిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడంచెల వ్యూహాలను రచించారు. ఫస్ట్ వ్యూహం సిద్ధం సభతో మొదలుపెట్టారు.. మొత్తం ఒక్కో ప్రాంతం వారిగా ఉత్తరాంధ్ర , కోస్తా, రాయలసీమ తదితర ప్రాంతాలలో కూడా సిద్ధం సభలను ఏర్పాటు చేసి.. చివరిగా చిలకలూరిపేటలో సిద్ధం సభను ముగించారు.. ముఖ్యంగా 3 లక్షలు, 6 లక్షలు , 9 లక్షలు, 12 లక్షలు ఇలా సభకు వచ్చేవారీ సంఖ్యను పెంచుకుంటూ సభను పూర్తి చేశారు.

ఇక రెండవ వ్యూహం బస్సు యాత్రని చేస్తున్నారు. మేమంతా సిద్ధం అనే పేరుతో ఆ చివరి నుంచి ఈ చివరిదాకా యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. రోజుకొక జిల్లా చొప్పున 25 పార్లమెంటు స్థానాలకు గాను ఆయా లెక్కల ప్రకారం జిల్లాల వారీగా పర్యటన చేసుకొస్తున్నారు. ఇది కూడా త్వరలోనే పూర్తి కాబోతోంది. తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం ఇలా తన రూట్ మ్యాప్ ప్రకారం ఐదారు రోజుల్లో మేమంతా సిద్ధం సభ కూడా పూర్తి కాబోతోంది.

మేమంతా సిద్ధం సభ పూర్తి అవ్వగానే హెలిఫ్ కాటర్  టూర్ అనేది మరొక వ్యూహం మొదలు పెట్టబోతున్నారు.హెలిఫ్ కాటర్ లో రోజుకి మూడు నుంచి నాలుగు సభలకు ఏర్పాట్లు చేసుకొని ముందుకు వెళ్లబోతున్నారు జగన్. ఉదయం 10కి ఒకటి, 12కి మరొకటి.. సాయంత్రం 3కి ఒకటి ,5 ఇంటికి ఒకటి ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇతరుల మీద ఆధారపడకుండా కేవలం తను తన మనుషులే అన్నట్లుగా ఈ వ్యూహాల రూట్లోనే జగన్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేసేందుకు కూడా పలు రకాల కసరత్తులు చేస్తున్నట్లుగా వైసిపి నేతల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ మేనిపోస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: