రాయి ఎటాక్: జగన్ పై రాయి దాడి.. నిందితులు వీళ్ళే..!!

Divya
గత శనివారం రోజున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి జరిగిన ఘటన రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.. ముఖ్యంగా ఈ దాడిని పలువురు టిడిపి నేతలు చేయించారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. అలాగే పవన్ కళ్యాణ్ , చంద్రబాబు పైన ec కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ విషయం పైన అటు జనసేనా,  టిడిపి నేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా పలు రకాలుగా సెటైర్లు వేస్తూ ఉన్నారు. కేవలం సింపతి కోసమే జగన్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని. గతంలో కోడి కత్తి డ్రామా లాంటిదే ఇప్పుడు రాయి డ్రామా అంటూ ఎద్దేవా చేశారు.

అయితే ఈ రాయి  ఘటన పైన పోలీసులు సైతం  దర్యాప్తు చేపట్టారు.. వీటితోపాటు ఈ దాడి చేసిన వ్యక్తిని పట్టిస్తే నగదు బహుమతిని కూడా ప్రకటించారు. తాజాగా దర్యాప్తులో భాగంగా పురోగతి సాధించినట్లు తెలుస్తోంది పోలీసులు.. ముఖ్యంగా ఈ కేసులో ఐదుగురు యువకులను అనుమానితులుగా పోలీసులు గుర్తించారు .దీంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.. అసలు విషయంలోకి వెళ్తే అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందినటువంటి సతీష్ (సత్తి) అని యువకుడే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

సతీష్ తో పాటు మరొక నలుగురు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారట. అయితే ఈ దాడికి గల కారణాలను ఇంకా అధికారులు ప్రశ్నిస్తున్నారు.. అయితే సీఎం జగన్ పైన దాడికి విసిరినటువంటి రాయి.. రాయి కాదని అది పాత టైల్స్ ముక్క అన్నట్లుగా వెల్లడించారు.. టైల్స్ రాయిని జేబులో వేసుకొని వచ్చి సడన్గా ఈ దాడి చేసినట్లుగా పోలీసులు సైతం గుర్తించామంటూ తెలియజేశారు. మరి ఈ దాడి చేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని ఈరోజు విచారణలో భాగంగా కనిపెడతామంటూ పోలీసులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: