కేసీఆర్ లోని ఉద్యమ స్ఫూర్తి ఏమైంది.. ఇంత సైలెంట్ అయ్యాడేంటి?

praveen
తెలంగాణ ప్రజల చిరకాల కలగా ఉన్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అంటే అందుకు కారణం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది ఆయనే. కెసిఆర్ లేకపోతే ఇక ప్రజల్లో అంత ఉద్యమ స్ఫూర్తి వచ్చేది కాదు అని విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే మేధావులు ఉద్యమకారులు కలుపుకొని అందరిని ఒక్కతాటిపై నిలబెట్టి ఉద్యమాన్ని సాగించారు. దశాబ్దాల పాటు ఉద్యమం సాగించి చివరికి ప్రాణాలకు సైతం తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్ర కళను సహకారం చేసుకున్నారు.

 ఇలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ చూపించిన తెగువ వెలకట్టనేని అనడంలో సందేహం లేదు. అలాంటి ఉద్యమ స్ఫూర్తి కలిగిన కేసీఆర్ ఇక ఇప్పుడు కనీసం పార్టీని కాపాడుకోలేకపోతున్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర పరాభవంతో కేసీఆర్ డీల పడిపోయారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. కానీ ఒక్కసారి ఓటమి తర్వాత బిఆర్ఎస్ పని అయిపోయిందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే పరిస్థితి అలాగే ఉంది. అయితే జరుగుతుందంతా చూస్తూ ఉండడం తప్ప అటు కేసీఆర్ మాత్రం ఏమి చేయడం లేదనే టాక్ తెలంగాణ రాజకీయాల్లో ఉంది.

 ఒకవైపు అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుంది. బీఆర్ఎస్ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కీలక నాయకులు అందరిని కూడా తమ పార్టీ గూటికి చేర్చుకుంటుంది. ఒకరకంగా బీఆర్ఎస్ ను కాళీ చేసే ప్రయత్నాలే జరుగుతున్నాయి  అయినా గులాబీ దళపతి కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేయడం లేదనే టాక్ ఉంది. ఒకప్పుడు టికెట్ కోసం ఎంతోమంది పోటీ చేసిన పరిస్థితి నుంచి చివరికి ఇక పార్టీ తరపున నిలబెట్టేందుకు ఒక అభ్యర్థి కోసం కేసీఆర్ వెతుక్కోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ కు వచ్చింది. ఎంతోమంది పార్టీని వీడగా..  మిగతా నాయకులు పార్టీలో ఉండేలా నమ్మకం కల్పించడంలో కెసిఆర్ విఫలమవుతున్నారని వాదన వినిపిస్తోంది. ఇక ఇటీవల జరిగిన చేవెళ్ల సభలో కేసిఆర్ స్పీచ్ కోసం అందరూ ఎదురు చూసారు. కానీ ఆయన  ప్రసంగంలో మునుపటి మెరుపులు  కనిపించలేదు. ఎంతసేపు చెప్పిందే చెప్పి తిప్పి తిప్పి కాంగ్రెస్ బిజెపికి ఓటు వేయద్దు అని చెప్పారు తప్ప.. ప్రజలను ఆకట్టుకునేలా కొత్తగా మునుపటి రీతిలో ప్రసంగం మాత్రం లేదు. దీంతో కెసిఆర్ త్వరగా వాస్తవాలను గ్రహించి పార్టీలోని పరిస్థితులను చక్కదిద్దాలని బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kct

సంబంధిత వార్తలు: