ఉత్తరాంధ్ర: బాబు టూర్లో రాజధాని నినాదం?

Purushottham Vinay
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ఉత్తరాంధ్రాలో నాలుగు రోజుల ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆయన సుడిగాలి వేగంతో పర్యటనలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖలో విజయనగరంలో శ్రీకాకుళంలో ఇలా ప్రతీ జిల్లాలో రెండు మూడు సభలు వంతున తెలుగు దేశం పార్టీ చంద్ర బాబు నాయుడు ప్రసంగాలు చేపడుతున్నారు.విజయనగరంతో పాటు ఎలమంచిలి సభలలో చంద్ర బాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జత కలవనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన నేపధ్యంలో మరోసారి విశాఖ రాజధాని నినాదానికి వైసీపీ తెర లేపింది. చంద్ర బాబు శ్రీకాకుళం వస్తున్న క్రమంలో ఆయన  వెనకబడిన ఉత్తరాంధ్రాకు ఏమి చేశారు అని ప్రశ్నించారు.శ్రీకాకుళం జిల్లా అంతా టీడీపీకి ఓట్లు సీట్లూ ఇస్తే ఒక్క కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఇచ్చారా అని ప్రశ్నించడం జరిగింది. అభివృద్ధి అంతా వైసీపీ హయాంలోనే జిల్లాలో జరిగిందని ఆయన చెప్పారు.ఇక వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర పూర్తిగా బాగుపడుతుందని ఆయన అన్నారు.


ఉత్తరాంధ్ర వెనకబాటుతనం పోవడానికే వైజాగ్ ని రాజధానిగా చేయాలని వైసీపీ నిర్ణయించిందని ఆయన అన్నారు. వైసీపీ గెలిస్తే వైజాగ్ రాజధాని అవడం ఖాయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఏలుబడిలో ఉత్తరాంధ్రాను అసలు పట్టించుకోలేదని విమర్శించారు.ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితమే అమరావతి మన రాజధాని అంటూ నినాదం చేశారు. ఆయన గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన ప్రజాగళం సభలో మాట్లాడుతూ అమరావతిని తాను అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని గా తీర్చిదిద్దుతామని  అన్నారు.దాంతో చంద్ర బాబు ఉత్తరాంధ్ర టూర్ లో సీనియర్ మంత్రి ధర్మాన విశాఖ రాజధాని నినాదాన్ని వినిపించారు. మరి బాబు వైజాగ్ ని ఆర్ధిక రాజధానిగా చేస్తామని అంటున్నారు. అది కాదు పూర్తి రాజధాని గా వైసీపీ చేస్తుందని అసలైన అభివృద్ధి ఏమిటో చూపిస్తుందని ధర్మాన అన్నారు.మొత్తానికి చూస్తే చంద్ర బాబు నాయుడు వైజాగ్ రాజధాని మీద ఏమైనా చెబుతారా అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: