ఏపీ : రివర్స్ పాలనకు రివర్స్ ఫలితాలు.. వైసీపీకి కేవలం 2 లోక్ సభ స్థానాలేనా?

Reddy P Rajasekhar
ఏపీలో కొన్నిరోజుల క్రితం వరకు వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉండగా మళ్లీ కూటమికి అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి. ఐదేళ్లలో జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ రివర్స్ పాలన చేయగా ఫలితాలు కూడా రివర్స్ లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వేలో కూటమి 19 నుంచి 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధించే ఛాన్స్ ఉందని వైసీపీ 2 నుంచి 6 లోక్ సభ స్థానాలలో గెలిచే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది.
 
2019 ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాలతో సంచలనాలు సృష్టించగా ఈ ఎన్నికల్లో ఫలితాలు ఘోరంగా ఉండబోతున్నాయని సర్వేల లెక్కలు చెబుతున్నాయి. దేవుడి స్క్రిప్ట్ ఇదేనంటూ కూటమి అభిమానులు ఈ సర్వే ఫలితాల గురించి స్పందిస్తున్నారు. ఈ ఫలితాలు నిజమైతే మాత్రం వైసీపీ 2024 ఫలితాల తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే వైసీపీ చేసిన పెద్ద తప్పు అని తెలుస్తోంది.
 
దాదాపుగా రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చానని జగన్ చెబుతున్నా గత మూడేళ్లలో కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాల లెక్క చెబితే కూడా బాగుంటుందని నెటిజన్లు, సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించి ఉంటే రాష్ట్రంలో ఇప్పటికే కొంతమేర అయినా అభివృద్ధి జరిగేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ను జగన్ మాత్రం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు.
 
2019 ఎన్నికల్లో చంద్రబాబుతో పోల్చి చూస్తే జగన్ మెరుగైన పాలన అందిస్తారని ప్రజలు భావించగా బాబు పాలన ఎలా ఉందో జగన్ పాలన అలానే ఉందని ఏపీ ఓటర్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే ఫలితాలు వైసీపీ నేతలను గజగజా వణికిస్తున్నాయి. టీడీపీ సూపర్ సిక్స్ హామీలతో పాటు వాలంటీర్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోగా వైసీపీ మాత్రం ఎలాంటి కొత్త హామీలను ప్రకటించడం లేదు. జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వైసీపీకి తీవ్రస్థాయిలో నష్టం చేస్తుందని పార్టీ నేతలు ఫీలవుతున్నారు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: