సికింద్రాబాద్ : దానం వింత కండిషన్.. అభ్యర్థిని మార్చబోతున్న కాంగ్రెస్?

praveen
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకముందే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకోవడంతో అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు.

 అయితే గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్న బిజెపి పార్టీ.. ఇక ఈసారి హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే మరోసారి కేంద్రమంత్రి, సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి బిజెపి తరఫున బరిలోకి దిగుతున్నారు.  సికింద్రాబాద్ గడ్డ తన అడ్డా అని చెప్పుకునే పద్మారావు గౌడు  బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని పట్టుదలతో కాంగ్రెస్ ఉండగా.. అటు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఎక్కడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

 బీఆర్ఎస్ కంటే ముందుగానే అటు దానం నాగేందర్ ని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. కానీ ఆయన ఎక్కడ ఇప్పటి వరకు ప్రచారంలో కనిపించలేదు. దీంతో ఇక కార్యకర్తలందరూ కన్ఫ్యూషన్ లో మునిగిపోయారు. దానం నాగేందర్ ని ఫైనల్ చేసేసారా లేకపోతే మరో అభ్యర్థిని మారుస్తారా అనే విషయంపై కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే దానం పెడుతున్న కండిషన్ల పై అటు కాంగ్రెస్ హై కమాండ్ ఆగ్రహంతో ఉంది అని ఒక ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పుడు వరకు ప్రచార రంగంలో అటు దానం ఎక్కడ కనిపించకపోవడంతో ఇది నిజమే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

 ఇంకోవైపు సొంత పార్టీ నేతలను కాదని బిఆర్ఎస్ నుంచి కొత్తగా పార్టీలో చేరిన దానం నాగేందర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడంఫై పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉంది అని టాక్ కూడా ఉంది. అయితే ఎంపీగా ఓడిపోతే.. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని దానం నాగేందర్ రెడ్డి కండిషన్ పెట్టారట. కానీ ఇక దానంకు మినిస్ట్రీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనె సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అనుకుంటున్నారట. బొంతు రామ్మోహన్ కు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది  ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: