ఏపీ: ఓటర్లలో కూడా వారిదే పై చేయి..!

Divya
ఒకప్పుడు ఆడపిల్ల పుడితే అరిష్టం అన్నట్టు సమాజం వ్యవహరించేది.. కానీ మారుతున్న కాలం తగ్గట్టుగా ఆడపిల్ల పుడితే మహారాణి పుట్టిందనే రోజులు మళ్లీ తిరిగి వస్తున్నాయి.. అన్ని రంగాలలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. విద్య, వైద్యం ఆఖరికి రాజకీయాల్లో కూడా ప్రత్యక్షంగా పోటీ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. అయితే ఇక్కడ పోటీ చేసే వారే కాదు ఆ పోటీ చేసే వారికి అండగా నిలుస్తున్నది కూడా మహిళలే కావడం గమనార్హం .ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు జరగబోతున్న నేపథ్యంలో ఓటర్ల లిస్టు తీయగా అందులో ఎక్కువగా మహిళా ఓటర్లే ఉన్నట్లు తెలుస్తోంది..
ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈవో ముఖేష్ కుమార్ మీనా గురువారం రోజు విడుదల చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ,  పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో ముఖ్యంగా మహిళ ఓటర్ల అత్యధికంగా ఉన్నారని తెలిపారు.. 2024 జనవరి 22న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 4,08, 07,256  మంది ఓటర్లు  ఆ ఓటర్ల సంఖ్య ఇప్పుడు 4,14,01,887 కి చేరుకుంది. ఇక ఇందులో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉండగా, 2,03,39,851 మంది పురుష ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఇందులో ట్రాన్స్ జెండర్లు 3,421 మంది ఉండగా.. సర్వీస్ ఓటర్లు 68,185 ఉన్నట్లు సమాచారం.. ఇకపోతే తుది జాబితా కంటే 5,94,631 ఓటర్లు పెరిగినట్లు సమాచారం.

 ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు ఉన్న జాబితాలో కర్నూలు మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 20,56,203 మంది ఓటర్లు ఉన్నారు.  రెండవ స్థానంలో అనంతపురం నిలిచింది ..ఇందులో 20,20,243 మంది ఓటర్లు ఉన్నారు. విశాఖ జిల్లా మూడో స్థానంలో నిలిచింది .. ఈ జిల్లాలో 20,16,069 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా అత్యల్ప స్థాయిలో ఓటర్లు ఉన్న జిల్లాగా చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది ..ఇందులో కేవలం 7,71, 478 మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం. మొత్తానికైతే ఇక్కడ ఓట్ల జాబితాలో కూడా ఆడవారిదే పై చేయి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: