యనమల : దుబారా ఖర్చులు తగ్గిస్తే.. టీడీపీ మేనిఫెస్టో సాధ్యమే..!!

murali krishna
రాష్ట్రం లో మరో 10 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుంది.అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తమ మేనిఫెస్టోలు ప్రకటించాయి.అయితే ప్రస్తుతం ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మేనిఫెస్టో వార్ నడుస్తుంది.తాము సాధ్యమయ్యే హామీలే ఇస్తామంటూ వైసీపీ చెబుతుంది. వైసీపీ పార్టీ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకే నగదు పెంచి మేనిఫెస్టో రూపొందించగా, వైసీపీ కంటే ఎక్కువ పథకాలతో తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో రూపొందించింది.ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు.కూటమి మేనిఫెస్టో ప్రజలు అందరికీ ఆమోదయోగ్యమైనది గా వుంది అని, ఒక్క వైసీపీకి మాత్రం మింగుడు పడట్లేదని యనమల వ్యాఖ్యనించారు.ప్రజలంతా కూటమి మేనిఫెస్టో ను మెచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు. కూటమి మేనిఫెస్టో వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఈ వినాశనం నుండి రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకే ఈ మేనిఫెస్టో ఎంతో ఆమోదయోగ్యం గా ఉందని తెలిపారు.ఇది పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టో అని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రం లో దుబారా ఖర్చు తగ్గించుకుంటే 2 వేల నుండి 3 వేల కోట్ల వరకు ఆదాయం మిగులుతుందని ఆయన తెలిపారు.ఎన్డీయే కూటమికి మద్దతిస్తుంది కాబట్టి కేంద్రం నుండి ఎక్కువ సంఖ్య లో నిధులు రాబట్టి తాము సంక్షేమ పధకాలు అమలు చేయనున్నట్లు యనమల రామకృష్ణుడు తెలిపారు. అయితే యనమల వ్యాఖ్యల పై వైసీపీ ట్రోల్స్ చేస్తుంది.అధికారం లోకి వచ్చాక చంద్రబాబు చేసేవే దుబారా ఖర్చులని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎందుకు పనికిరాని కార్యక్రమాలు పెట్టి ప్రజా ధనాన్ని వృధా చేస్తారని వారు విమర్శిస్తున్నారు.టీడీపీ మేనిఫెస్టో వల్ల రాష్ట్రానికి అప్పుల భారమే తప్ప రాష్ట్రానికి ప్రయోజనమేమి ఉండదని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: