హీరో, హీరోయిన్ల ఎఫైర్లకి.. నిర్మాతలే కారణం : హీరోయిన్

praveen
సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ గురించి ఎప్పుడు ఎన్నో రకాల వార్తలు తెర మీదకి వస్తూనే ఉంటాయి అని చెప్పాలి  ఒక హీరో ఒక హీరోయిన్ రెండు మూడు సినిమాలలో కలిసి నటించారు అంటే చాలు వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అంటూ ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. ఇక హీరో హీరోయిన్ ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే ఇలా హీరో హీరోయిన్ల మధ్య ఏదో నడుస్తుంది అంటూ వచ్చే గాసిఫ్స్ సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 అసలు ఈ గాసిప్స్ ఎవరు పుట్టిస్తారు. ఇలాంటి పుకార్లు ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయి అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఇలా హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్లకు సంబంధించి వచ్చే గాసిప్స్ గురించి ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  ఏకంగా దర్శక నిర్మాతలే హీరో హీరోయిన్ల మధ్య ఏదో నడుస్తుంది అంటూ గాసిప్స్ పుట్టిస్తారు అంటూ సంచలన విషయాలను చెప్పుకొచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. బాలీవుడ్ లో దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన మనిషా కొయిరాల.. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది. తన అందం అభినయంతో ఇప్పటికే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా కోయిరాలా సినిమా హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ ఉందంటూ వచ్చే గాసిప్స్ గురించి షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది. హీరో హీరోయిన్ల మధ్య ఏఫైర్ సినిమా నిర్మాతలే క్రియేట్ చేసే వారిని హీరోయిన్ సోనాలి బింద్రే తెలిపింది. వాళ్ళు సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటివి సృష్టించేవారు అంటూ చెప్పుకొచ్చింది. నాపై కూడా చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ అందులో ఒక్కటి కూడా నిజం లేదు. అయితే ఇలా రూమర్స్ ట్రెండ్ అప్పట్లో ఇండస్ట్రీలో బాగా కొనసాగింది. ఇక ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్ అవుతానని నేను అస్సలు అనుకోలేదు అంటూ సోనాలి బింద్రే తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: