జూన్ 2న కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ ?

RAMAKRISHNA S.S.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన గులాబీ పార్టీ... ప్రతిపక్ష పార్టీగా చాలా బలమైన పాత్రను పోషిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి గుణపాటాలు నేర్చుకుంటూ.. నిత్యం జనాల్లో ఉంటున్నారు గులాబీ నేతలు. కెసిఆర్ నుంచి మొదలుకొని.. కిందిస్థాయి నేతలందరూ నిత్యం పల్లెల్లో తిరుగుతున్నారు. మళ్లీ గులాబీ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఇలాంటి నేపథ్యంలోనే గులాబీ పార్టీకి మరో అగ్ని పరీక్ష ఎదురైంది. అవే పార్లమెంటు ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ కచ్చితంగా ఏడు సీట్ల నుంచి 10 సీట్లు గెలవాలి. అలా గెలవకపోతే గులాబీ పార్టీ ఖాళీ అవడం ఖాయం. ఇప్పటివరకు ఉన్న అగ్ర నేతలు అందరూ గులాబీ పార్టీకి రాజీనామా పెట్టి... జంప్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే వీటన్నింటినీ బేరిజు వేసుకున్న గులాబీ పార్టీ అగ్రనేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు... అధికార కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నారు కేసీఆర్. కెసిఆర్ తో పాటు హరీష్ రావు మరియు కేటీఆర్ లు కూడా... అడుగడుగున ప్రచారం చేస్తూ... రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని సీట్లను కైవసం చేసుకుంది గులాబీ పార్టీ. ఇందులో భాగంగానే ఇప్పుడు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకు.. టిఆర్ఎస్ అనేక వ్యూహరచనలు చేస్తోంది.

ఇందులో భాగంగానే రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు ఓటు వేస్తే... హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి ప్రచారంలో చెబుతున్నారు. దానికి తోడుగా నేతలందరూ ఇదే పాట పాడుతున్నారు. కాంగ్రెస్ మరియు బిజెపిలకు ఓటు వేస్తే హైదరాబాద్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుందని ఆలోచనలను జనాల్లో రేకెత్తిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.

హైదరాబాద్ ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతం అయితే... రెవెన్యూ మొత్తం పోతుంది. తెలంగాణకు ఎలాంటి ఆదాయం ఉండదు. ఇదే విషయాన్ని కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అంశాలను డైవర్ట్ చేసేందుకు... అమిత్ షా... ముస్లింల రిజర్వేషన్లపై మాట్లాడిన మాటలను... కాంగ్రెస్, బిజెపి పార్టీలు తెరపైకి తీసుకు వచ్చినట్లు కొంతమంది చెబుతున్నారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు వచ్చాయని జోరుగా ప్రచారం కూడా జరిగింది.

ఇలా గులాబీ పార్టీ ఎలాంటి వూహ రచనలతో ముందుకు వెళ్లినా... బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలు ఆ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తానికి ఈ పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి అగ్నిపరీక్షగా మారిపోయాయి అని చెప్పవచ్చు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎక్కువ సీట్లు గెలవకపోతే... కెసిఆర్ కు మళ్ళీ కష్టాలు తప్పవని విశ్లేషణ చేస్తున్నారు రాజకీయ నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: