విశాఖ: వైసీపీ ముందు తేలిపోతున్న టీడీపీ?

Purushottham Vinay
విశాఖలో వైసీపీ గాలి బాగా వీస్తుందని చెప్పాలి.ఈసారి ఎలాగైనా విశాఖ ఎంపీ స్థానంలో పాగా వేయాలని టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. వైసీపీని ఎలాగైనా ఓడించి తీరాలన్న కసితో సుమారు పోలింగ్ కి పది రోజుల ముందు నుంచే నోట్లతో ఓట్ల కొనుగోలుకి తెలుగు దేశం పార్టీ తెర తీస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో విశాఖ సిటీ పరిధిలో టీడీపీ బలంగా ఉన్నట్లు కనిపించినా కానీ ప్రస్తుతం రాజకీయం పూర్తిగా మారిపోయింది. పైగా వైసీపీ లోకల్ క్యాడిడేట్ అయిన బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్ధిగా పోటీలోకి దించింది. ఈ సమయంలో ఆమెకు రోజు రోజుకీ ఆదరణ, అభిమానం పెరుగుతుండటంతో.. టీడీపీ అభ్యర్ధి శ్రీ భరత్ తేలిపోతున్నారనే అంచనాలు బయటకు వస్తున్నాయి.పైగా దానికి తోడు విశాఖ రాజధాని అని, అక్కడ నుంచే పాలన అని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేయడంతో ఆ ప్రభావం కూడా పడుతోంది. దీంతో నోట్ల కట్టలతో రాజకీయం మొదలెట్టేశారని సమాచారం తెలుస్తుంది.


ఇందులో భాగంగా... పోలింగుకు సుమారు పది రోజుల ముందు నుంచే నోట్ల కట్ల పాములు బుట్టలో నుంచి బయటకు వస్తున్నాయని సమాచారం. దాంతో టీడీపీకి ఓటమి ముందే తెలిసిపోయిందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇదే సమయంలో... టీడీపీ వాళ్లు ఓటుకి ఎంతిచ్చినా, మరెన్ని కుయుక్తులు పన్నినా.. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, విద్యా పథకాలు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఇంకా నవరత్నాలే తనను గెలిపిస్తాయని ఆ పార్టీ అభ్యర్థి బొత్సా ఝాన్సీ బల్లగుద్ది మరీ చెబుతున్నారు . ఇదే సమయంలో.. జగన్ మోహన్ రెడ్డి పాలనతో పాటు గతంలో ఎంపీగా ఉండి తాను చేసిన అభివృద్ధి, ఉత్తరాంధ్ర కోసం పోరాడిన తీరు కూడా తమకు సానుకూలాంశాలని చెబుతున్నారు.ఇంకా అదేవిధంగా... ఉత్తరాంధ్ర ప్రజలు తనను ఆడబిడ్డలా చూస్తున్నారని, సొంత బిడ్డలా ఆదరిస్తున్నారని..దాని ఫలితంగా తన గెలుపుని ఆపడం ఎవరి తరం కాదని ఆమె సవాల్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా విశాఖ ఎంపీ సీటులో వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని.. ఈ నేపథ్యంలోనే తమ్ముళ్లు నోట్ల కట్టల పంచాయతీ మొదలుపెట్టారని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: